![]() |
![]() |

ఒక మనసు సినిమాతో తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద మెరిసిన నటీ నీహారిక కొణిదెల.2016 లో వచ్చిన ఆ మూవీలో నాగ శౌర్య తో కలిసి జతకట్టిన నీహారిక నటనకి ప్రేక్షకుల నుంచి విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.పైగా మెగా హీరోల వారసత్వాన్ని నిహారిక మరింత ముందుకు తీసుకెళ్తుందని అందరు అనుకున్నారు .కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు ఆమెకి ఎలాంటి బ్రేక్ ని ఇవ్వలేదు. ఇప్పుడు నీహారిక కి సంబంధించిన న్యూస్ ఒకటి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది
నీహారిక తాజాగా మద్రాస్ కారన్ అనే మూవీలో నటించబోతుంది. మలయాళంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆర్ డి ఎక్స్ ద్వారా బాగా పాపులర్ అయిన షేన్ నిగమ్ తో కలిసి నీహారిక స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ విషయాన్ని నీహారిక తన సోషల్ మీడియా ద్వారా వెల్లడి చేసింది. ఆర్ డి ఎక్స్ డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్నే సాధించింది. ఎస్ఆర్ ప్రొడక్షన్స్ పై బి.జగదీష్ నిర్మిస్తున్న మద్రాస్ కారన్ కి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.

నీహారిక కి చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తితో 2020 లో వివాహం జరిగింది.కొన్ని మనస్పర్థల వల్ల గత ఏడాది ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆమె తన రీ ఎంట్రీ ని తెలుగులో కాకుండా మలయాళంలో ఇస్తుండటం ఆసక్తిని నెలకొల్పుతుంది. నీహారిక పలు వెబ్ సిరీస్ లలో నటించింది
![]() |
![]() |