![]() |
![]() |

తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత మంది హీరోలున్నా కూడా నేను ఎవరకి పోటీ కాదు నాతో నేనే పోటీ అనే రీతిలో మొదటి నుంచి సినిమాలు చేసుకుంటూ పోయే అగ్ర నటుడు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున(nagarjuna).అలాగే కొత్త వారికి అవకాశాలు ఇచ్చి సక్సెస్ కొట్టడం లో నాగ్ తర్వాతే ఎవరైనా. అందుకే ఆయన్ని అభిమానులు కింగ్ అని పిలుస్తారు. తాజాగా ఆయన నా సామి రంగ(naa saami ranga) తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక రికార్డు సృష్టించాడు.
సంక్రాంతి కానుకగా ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నా సామి రంగ విడుదలైన అన్ని చోట్ల కూడా ప్యూర్ పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. మూడు రోజులకి గాను 24 .8 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.అంటే 12 .5 కోట్ల షేర్ ని నాగ్ రాబట్టాడు. ఈ ఫిగర్ నాగార్జున కెరీర్ లో నే ది బెస్ట్ ఫిగర్ అని చెప్పవచ్చు.అలాగే చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకి లాభాల బాటని కూడా నా సామి రంగ తెచ్చిపెడుతుంది. ఇప్పటికే సీడెడ్, ఉత్తరాంధ్ర లో బ్రేక్ ఎవెన్యూ కూడా అయిన ఈ మూవీ రన్నింగ్ లో మరింత విజయం దిశగా పయనించవచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
నా సామి రంగ విజయంతో నాగార్జున సంక్రాంతి హీరో అని మరో సారి నిరూపితమవ్వడమే కాకుండా నాగ్ అభిమానులు కూడా ఈ సినిమా విజయం పట్ల ఫుల్ జోష్ లో ఉన్నారు. అలాగే సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమా నా సామి రంగ అని ముక్తకంఠంతో అంటున్నారు.
![]() |
![]() |