![]() |
![]() |

సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలైన 'హనుమాన్' సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ ను వదిలారు. హనుమాన్ వంద కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా దర్శక నిర్మాతలు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. హీరో తేజ సజ్జా అయితే ఇది తనకి 'జెర్సీ మూమెంట్' అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
ట్రేడ్ వర్గాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు రూ.7.97 కోట్ల షేర్, రెండో రోజు రూ.4.36 కోట్ల షేర్, మూడో రోజు రూ.5.70 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.6 కోట్ల షేర్ రాబట్టిన హనుమాన్.. నాలుగు రోజుల్లో రూ.24.03 కోట్ల షేర్ తో సత్తా చాటింది. ఏరియాల వారీగా చూస్తే నాలుగు రోజుల్లో నైజాంలో రూ.10.46 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.3.29 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.10.28 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.13.05 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.13.95 కోట్ల షేర్ కలిపి.. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.51.03 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
రూ.29 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన హనుమాన్.. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.13.77 కోట్ల షేర్, రెండో రోజు రూ.10.81 కోట్ల షేర్, మూడో రోజు రూ.14.05 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.12.40 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా రూ.20 కోట్లకు పైగా లాభాలను చూసింది. ఫుల్ రన్ లో మరో రూ.20 కోట్లకు పైగా లాభాలను చూసే అవకాశముంది.
తెలుగు రాష్ట్రాలకు ధీటుగా నార్త్ లో, ఓవర్సీస్ లో 'హనుమాన్'కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇదే జోరు కొనసాగితే ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరినా ఆశ్చర్యం లేదు.
'హనుమాన్' మూవీ 4 రోజుల వసూళ్లు:
నైజాం: రూ.10.46 కోట్ల షేర్
సీడెడ్: రూ.3.29 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.10.28 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల వసూళ్లు: రూ.24.03 కోట్ల షేర్
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: రూ.13.05 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.13.95 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల వసూళ్లు: రూ.51.03 కోట్ల షేర్
![]() |
![]() |