![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'కంగువ'. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో విడుదల కానున్న ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన 'కంగువ' ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. సంక్రాంతి కానుకగా తాజాగా 'కంగువ' నుంచి సెకండ్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సెకండ్ లుక్ పోస్టర్ లో సూర్య యుద్ధవీరుడిగా కనిపించడంతో పాటు ట్రెండీ లుక్ క్యారెక్టర్ లోనూ సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఇప్పటిదాకా విడుదలైన 'కంగువ' ప్రచార చిత్రాల్లో సూర్య లుక్ విభిన్నంగా ఉంది. ఆ ప్రచార చిత్రాలతో ఇదొక పీరియడ్ ఫిల్మ్ అనే భావన అందరిలో ఉంది. అయితే తాజాగా ట్రెండీ లుక్ లోనూ సూర్య కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనిని బట్టి ఇది రెండు వేరు వేరు కాలాలలో జరిగే కథ అని అర్థమవుతోంది.

'విధి కాలం కంటే బలమైనది. గతం, వర్తమానం, భవిష్యత్ ...కాలం ఏదైనా నలుదిక్కులా మార్మోగే పేరు ఒక్కటే..కంగువ ' అంటూ సెకండ్ లుక్ సందర్భంగా మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. సెకండ్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉండి 'కంగువ'పై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాని ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
యోగి బాబు, బాబీ డియోల్, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా వెట్రి పళనిస్వామి, ఎడిటర్ గా నిశాద్ యూసుఫ్ వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |