![]() |
![]() |

ధనుష్ (dhanush)అంటే తమిళనాడు ప్రజలు ఎందుకు అంతలా అభిమానంతో వెర్రెక్కి పోతారో ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా వైడ్ గా ఉన్న సినీ ప్రేక్షకులకి అర్ధం అయ్యింది. ఈ రోజు ధనుష్ నయా మూవీ కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇక అంతే తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ధనుష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
కెప్టెన్ మిల్లర్(captain miller)ట్రైలర్ ని చూస్తుంటే బ్రిటిష్ వారు ఒక గూడానికి చెందిన భారతీయుల మీద దౌర్జన్యాలు చేస్తుంటే వారిని ఎదుర్కునే యోధుడుగా ధనుష్ కనపడుతున్నాడు. అలాగే ఇండియన్ సైన్యం తో కలిసి ధనుష్ ఆర్మీ వ్యక్తిగా బ్రిటీష్ వారితో పోరాడటం కూడా చూపించారు .అలాగే పోరాట దృశ్యాలు కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి.టోటల్ గా చెప్పుకోవాలంటే ధనుష్ తన నటనలో దాగి ఉన్న ఇంకో కొత్త కోణాన్ని ప్రేక్షకులకి చూపించబోతున్నాడని అర్ధం అవుతుంది. అలాగే ట్రైలర్ చూసిన వాళ్ళందరు మూవీ సూపర్ డూపర్ హిట్ అని అనడంతో పాటు ట్రైలర్ లోనే ధనుష్ అంతలా అరాచకం సృష్టిస్తే ఇంక సినిమాలో ఏ రేంజ్ లో అరాచకం సృష్టించాడో అని కూడా అనుకుంటున్నారు.

ట్రైలర్ లో ధనుష్ తో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, (shiva raj kumar)ప్రియాంక మోహన్( priyanka mohan)మన తెలుగు నటుడు సందీప్ కిషన్ లు మెరిశారు. అంతే కాకుండా కెప్టెన్ మిల్లర్ లో చాలా ముఖ్యమైన క్యారక్టర్ లని పోషిస్తున్నారనే విషయం కూడా అర్ధం అవుతుంది. జనవరి 12 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న కెప్టెన్ మిల్లర్ కి అరుణ్ మాతేశ్వరన్ రచనా దర్శకత్వం వహించగా అరుణ్ త్యాగరాజన్, సెంథిల్ త్యాగరాజన్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్( g.v prakash kuamr)సంగీతాన్ని అందించాడు.
![]() |
![]() |