![]() |
![]() |

యంగ్ హీరో తేజ సజ్జ( teja sajja) హీరోగా జనవరి 12 న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న మూవీ హనుమాన్ (hanuman) ట్రైలర్ రిలీజ్ తో హనుమాన్ మీద అందరిలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే టైంలో మూవీలో హనుమంతుడుగా మెగాస్టార్ చిరంజీవి ( chiranjeevi) కనిపించబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా న్యూస్ ఒకటి ఆ విషయంపై పూర్తి క్లారిఫై ఇచ్చినట్టయిందనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.
రేపు ఆదివారం ఎన్ కన్వెన్షన్ లో హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తేజ సజ్జ తన ట్విటర్ లో నా హనుమాన్ మా హను మాన్ కోసం వస్తున్నారు అంటూ ట్వీట్ చేసాడు. దీన్ని బట్టి సినిమాలో తేజ హను మాన్ కాబట్టే చిరుని ఉద్దేశించి నా హనుమాన్ అన్నాడని అంటున్నారు. పైగా ఈ వ్యాఖ్యలతో హనుమాన్ లో హనుమంతుడుగా కనిపించేది చిరునే అని తేజ చెప్పకనే చెప్పాడని కూడా అంటున్నారు. తేజ ట్వీట్ చూసిన మెగా ఫ్యాన్స్ అయితే సంబరాల్లో మునిగిపోయారు.

ప్రశాంత్ వర్మ( prasanth varma) దర్శకత్వంలో తెరకెక్కిన హను మాన్ లో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా చేస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ ( vara laxmi sarath kumar)ముఖ్య పాత్రలో నటిస్తుంది. నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
![]() |
![]() |