![]() |
![]() |

సినీ వినీలాకాశంలో రెండున్నర దశాబ్దాల పై నుంచి హాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి తన అధ్బుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులని అలరించిన నటుడు క్రిస్టియన్ ఒలివర్ ( christian oliver). కెరీర్ ప్రారంభంలో టీవీ షోస్ లో నటించిన ఒలివర్ ఆ తర్వాత ది గుడ్ జర్మనీ అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన టామ్ క్రూజ్(tom cruise)వంటి మేటి నటుడుతో అనేక సినిమాల్లో కలిసి నటించాడు. తాజాగా ఆయనకి సంబంధించిన ఒక వార్త ఆయన అభిమానులని శోక సంద్రంలో ముంచెత్తుతుంది.
ఒలివర్ ,తన ఇద్దరు కూతుళ్లు అన్నిక్, మడితాలుతో కలిసి గ్రేనడైన్స్ లోని బెక్సియా ద్వీపం నుంచి సెయింట్ లూసియాకు విమానంలో వెళ్తున్నారు. ఆ తర్వాత టేక్ అఫ్ అయిన కొద్దీసేపటికే విమానం అరేబియా సముద్రంలో కుప్పకూలిపోయింది. దీంతో ఒలివర్ తో సహా ఆయన ఇద్దరు కూతుళ్లు మరణించారు. వీరితో పాటు ఫైలట్ కూడా చనిపోయాడు.సమీప మత్స్య కారుల సహాయంతో కోస్ట్ గార్డ్ సిబ్బంది మృతదేహాలని సముద్రం నుంచి వెలికి తీశారు.
వీరి మరణాలు సహజమైనవా లేక ఏమైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో అధికారులు మృతదేహాలని శవ పరీక్షలకి పంపించారు.2008 లో వచ్చిన యాక్షన్ కామెడీ చిత్రం స్పీడ్ రేసర్ మూవీ ఒలివర్ మంచి పేరుని తీసుకొచ్చింది. తన కెరీర్ మొత్తం లో 60 కి పైగా సినిమాల్లో నటించిన ఒలివర్ ఇటీవలే ఫరెవర్ హోల్డ్ యువర్ పీస్ (forever hold your peace) అనే మూవీలో నటించిన ఆయన తన క్యారక్టర్ వరకు ఉన్న వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసాడు.
![]() |
![]() |