![]() |
![]() |

మూవీ : కన్జూరింగ్ కన్నప్పన్
నటీనటులు: సతీష్ ,రెజీనా, నాజర్, ఆనంద్ రాజ్, శరణ్య పొన్వన్నన్, విటివి గణేష్ తదితరులు
ఎడిటింగ్: ప్రదీప్ ఈ. రాఘవ్
సినిమాటోగ్రఫీ: ఎస్. యువ
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
నిర్మాతలు: కలపతి ఎస్. అగోరమ్, కలపతి ఎస్. గణేష్
రచన, దర్శకత్వం: సెల్విన్ రాజ్
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్
హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. అందులో సస్పెన్స్ కూడా జోడిస్తే మరింత హైప్ క్రియేట్ అవుతుంది. అయితే హర్రర్ కామెడి జానర్ లో సతీష్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ' కన్జూరింగ్ కన్నప్పన్' నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో అందుబాటులో ఉంది. మరి ఆ మూవీ కథేంటో ఓసారి చూసేద్దాం..
కథ :
కన్నప్పన్(సతీష్) తమిళనాడులోని ఓ ప్రాంతంలో అమ్మ, నాన్న , మామయ్యతో కలిసి జీవిస్తుంటాడు. కన్నప్పన్ బిటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం శతవిధాల ప్రయత్నిస్తుంటాడు. అతనికి ఉన్న స్కిల్స్ కి ఎక్కడ ట్రై చేసిన ఉద్యోగం రాదు. కన్నప్పన్ వాళ్ళ అమ్మ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ వైరల్ అవ్వాలని చూస్తుంటుంది. వాళ్ళ నాన్నేమో అతనికొచ్చే పెన్షన్ డబ్బులతో తాగుతుంటాడు. ఇక కన్నప్పన్ మామయ్య జులాయిగా ఉంటూ అన్నీ తింగరిపనులు చేస్తుంటాడు. అయితే ఓ రోజు కన్నప్పన్ మొహం కడుక్కోడానికి వెళితే నీళ్ళరావు. ఇక ఏమైందో అని మేడమీదకి వెళ్లి చూస్తే అక్కడ ఓ తాంత్రికపూజలు చేసిన కర్స్ ఉంటుంది. అది చూసి ఏదో సాధారమైందని అనుకుంటాడు. అయితే కన్నప్పన్ ఆ కర్స్ కి ఉండే ఒక ఈకని పీకుతాడు. అప్పటి నుండి అతను పడుకున్న ప్రతీసారీ ఓ హంటెండ్ ప్యాలెస్ లోకి వెళ్తాడు. అదే విషయం అతనికి తెలిసిన ఓ సర్ ని అడుగుతాడు. అది ఓ శపించబడిన కర్స్.. దాని ఈకని పీకి నువ్వు పెద్ద తప్పు చేశావని కన్నప్పన్ కి అతను చెప్తాడు. ఆ తర్వాత కన్నప్పన్ కి కలలో జరిగిందే బయట జరుగుతుంది. మరి కన్నప్పన్ దీనిని నుండి బయటపడ్డాడా ? ఈ శపించబడ్డ కర్స్ వల్ల ఏం జరిగిందో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ :
కన్నప్పన్ ఉద్యోగం పడే కష్టాలని బాగా చూపించాడు డైరెక్టర్. ఇక అతనకి శపించబడిన కర్స్ దొరికిన నుండి ఓ హంటెండ్ ప్యాలెస్ కి వెళ్ళడం, అక్కడ జరిగేవన్నీ మొదట హర్రర్ ఫీల్ ని తెప్పించాయి. అయితే అదే సీన్ ని ఓ పది ఇరవై సార్లు చూస్తే ఎలా ఉంటుందో అదే తీసారు. అంటే ఒకసారి చూసిన సీన్ ని మళ్ళీ రీక్రేయేట్ చేయడం.. అది ప్రేక్షకుడికి కాస్త నిరాశని తెప్పిస్తాయి.
ఇక కన్నప్పన్, అతని ఫ్యామిలీ చేసే కామెడీ కాస్త నవ్వు తెప్పించిన అది ప్రధాన కథని డైవర్ట్ చేసెదిలా ఉన్నాయి. ప్రథమార్ధంలో దెయ్యం వచ్చే రెండు మూడు సీన్లు తప్ప మిగతాదంతా ఎడిటింగ్ లో ఓ సీన్ ని తీసుకొని కాపీ పేస్ట్ చేసినట్టుగా ఉంటాయి. ఇక దెయ్యాలకి కాస్ట్యూమ్ పెద్దగా సెట్ అవ్వలేదు. దెయ్యం అనే ఫీలింగే రాలేదు. మాములు మనుషలే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది.
ఒక్క ఫస్టాఫ్ కే సినిమా అంతా అర్థమైపోతుంది. నాజర్, రెజీనాతో వచ్చే సీన్స్ కాస్త సస్పెన్స్ ని క్రియేట్ చేసిన వాటికి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో అక్కడ నిరాశే ఎదురవుతుంది. ఇక స్లో సీన్లు చాలానే ఉన్నాయి. ప్రతీది రిపీట్ మోడ్ లో చూస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక ఆ దెయ్యం కథ చెప్పే ఫ్లాష్ బ్యాక్ సీన్ ఓ సారి చూడొచ్చు. ఇక సెకండాఫ్ పూర్తిచేయడానికి చాలా సమయం తీసుకున్నాడని స్పష్టంగా కనిపిస్తుంది. అడల్ట్ సీన్స్ పెద్దగా లేకున్నా హర్రర్ ని సరిగ్గా చూపించక, కామెడీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఇది కన్జూరింగ్ కన్నప్పన్ కాదు కన్నీళ్ళు తెప్పించిన కన్నప్పన్ అని చెప్పొచ్చు.
ఎస్. యువ సినిమాటోగ్రఫీ బాగుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఆకట్టుకుంది. ప్రదీప్ ఈ. రాఘవ్ ఎడిటింగ్ లో కొన్ని సీన్లని ట్రిమ్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
కన్నప్పన్ గా సతీష్ పర్ఫామెన్స్ బాగుంది. రెజీనా, నాజర్ తమ నటనతో సినిమా మీద కాస్త ఆసక్తిని కలిగించారు. ఇక మిగిలిన వారు వారి పాత్రలకు న్యాయం చేశారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్ :
హర్రర్ సినిమాలకి ఇష్టపడేవారు ఈ సినిమాని చూడకపోవడమే బెటర్. కామన్ ఆడియన్స్ ఓపిక ఉంటే ఓ సారి చూడొచ్చు.
రేటింగ్: 2 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |