Home  »  News  »  'కాథల్' మూవీ రివ్యూ

Updated : Jan 5, 2024

మూవీ : కాథల్
నటీనటులు: జ్యోతిక, మమ్ముట్టి తదితరులు
రచన : ఆదర్శ్ సుకుమారన్
సినిమాటోగ్రఫీ: సాలు కె. థామస్
ఎడిటింగ్: ఫ్రాన్సిస్ లూయిస్
మ్యూజిక్ : మాథ్యూస్ 
ప్రొడ్యూసర్ : మమ్ముట్టి
దర్శకత్వం : జో బేబీ

విభిన్న పాత్రలని చేయడానికి మలయాళ హీరో మమ్ముట్టి ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. అదే తరహాలో తీసిన మలయాళంలో విడుదలైన 'కాథల్' ని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...

కథ: 
మాథ్యూ తన భార్య ఒమానా, కుమార్తె మరియు తండ్రి దేవస్సీ కలిసి కేరళలోని ఓ గ్రామంలో ఉంటారు. వ్యక్తిగతంగా మాథ్యూ మంచివాడని ఆ గ్రామంలో అందరు అతనికి మర్యాద ఇస్తుంటారు. మాథ్యూ స్థానిక ఎన్నికలలో పోటి చేసేందుకు గాను ఓ పార్టీ  అతనికి పిలిచి మరీ టికెట్ ఇస్తుంది.‌ అయితే నామినేషన్ కి మరో రెండు రోజుల సమయం ఉందనగా మాథ్యూ భార్య ఒమానా, అతనిపై గే ఆరోపణలు చేస్తూ విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ ని వేసిందని తెలుకుంటాడు. ఇక అదే విషయం ఒమానాని అడుగగా కోర్టులో రెండు నెలల ముందే పిటిషన్ ఇచ్చాను అది వాదనకి ఇప్పుడు వచ్చిందని  ఒమానా చెప్తుంది. ఇక చేసేదేమీ లేక మాథ్యూ తన పార్టీ ఆఫీస్ కి వెళ్ళి తన నామినేషన్ ని వెనక్కి తీసుకుంటానని చెప్తాడు. కానీ  ఆ పార్టీ వాళ్ళు అలా వద్దని.. మీ వ్యక్తిగత విషయాలని మేము పరిగణలోనికి తీసుకోమని చెప్తారు. మరి ఎన్నికలలో మాథ్యూ గెలిచాడా? కోర్టు అతనికి ఏం తీర్పు ఇచ్చిందనేది తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:
సమాజంలో గౌరవంగా జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి 'మాథ్యూ'. అతని లైఫ్ లో రెండు అనుకోని సంఘటనలు ఒకేసారి జరిగినప్పుడు అతను ఎలా స్పందించాడు. ఇంతకీ అతని భార్య చేసిన ఆరోపణలు కరెక్టేనా అనే కథనంతో దర్శకుడు జో బేబీ ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు‌. డైలాగ్స్ బాగున్నప్పటికీ కథనం ఎంతకు ముందుకు కదలదు అన్నట్టుగా వెళ్తుంటుంది. ఓవైపు రాజకీయం, మరో వైపు కోర్ట్ లో కేసు ఏదీ పూర్తిగా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయలేకపోయారనిపించింది.

నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. చాలావరకు సినిమా నిడివిని తగ్గిస్తే బాగుండేది. అశ్లీల పదాలు ఏమీ వాడలేదు. అశ్లీల సీన్లు ఏమీ లేవు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ‌ఒక హోమో సెక్సువల్ పర్సన్ గురించి చెప్పడమెందునిపిస్తుంది.

ఒకప్పుడు హోమో సెక్సువల్ అనే దానిని చాలా చులకనగా, చాలా దారుణంగా చూసేవారు. అయితే దానిని ఇప్పుడు గవర్నమెంట్   లీగల్  చేయడంతో అది పెద్దగా తప్పు కాదనే భావన అందరిలోకి వచ్చేసింది. 2018 లో హోమో సెక్సువల్ అనేది తప్పేం కాదని వారికి సపోర్ట్ గా గవర్నమెంట్ లీగల్ గా ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. దానిని ప్రమోట్ చేస్తున్నట్టుగా ఈ సినిమా తీశారు మేకర్స్. అసలు మమ్ముట్టి ఇలాంటి ఒక క్లిష్టమైన పాత్రని చేయడానికి ఒప్పుకోవడం గ్రేట్ అని సినిమా చూస్తే అర్థం అవుతుంది. 

మాథ్యూస్ మ్యూజిక్ బాగుంది. ఆదర్శ్ సుకుమారన్ అందించిన కథని సరిగ్గా ప్రెజెంట్ చేయడంలో జో బేబీ విఫలమ్యాడు. సాలు కె. థామస్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫ్రాన్సిస్ లూయిస్ ఎడిటింగ్ అంతగా కనెక్ట్ కాలేకపోయింది. చాలావరకు స్లో సీన్లని తీసేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: 
మాథ్యూగా మమ్ముట్టి సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. ఒమానా పాత్రలో జ్యోతిక జీవించేశారు. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:
సమాజంలో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితానికి అతని అభిరుచులకి గవర్నమెంట్ ఇచ్చిన హాక్కుల గురించి చెప్పే విభిన్న కథని చూడాలనుకునేవారు ఈ సినిమాని ఓసారి చూసేయొచ్చు.

రేటింగ్ : 2.5/ 5 

✍️. దాసరి మల్లేశ్






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.