![]() |
![]() |

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) వివాదంలో చిక్కుకుంది. ఒక సినిమా కారణంగా కొందరు ఆమెపై దారుణంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తన కెరీర్ లో సీతాదేవి, అమ్మోరుతల్లి వంటి పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందిన నయనతార.. తాజాగా ఒక సినిమా కారణంగా విమర్శలు ఎదుర్కుంటోంది.
నయనతార నటించిన తాజా చిత్రం 'అన్నపూరణి' (Annapoorani). డిసెంబర్ 1న తమిళ్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇటీవల ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అన్నపూరణి అనే యువతిగా నయనతార కనిపించింది. ఆ బ్రాహ్మణ యువతి చెఫ్ కావాలని కలలు కనడం, ఆ కలని నిజం చేసుకొని మాంసాహారం వండటం.. అంతేకాదు ఒక యువకుడితో ప్రేమలో పడటం, నమాజ్ చేయడం వంటి సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. అందుకే ఈ సినిమాపై బ్రాహ్మణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. థియేటర్లలో విడుదల సమయంలోనే ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని తమిళనాట బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇప్పుడిక ఓటీటీలో అందుబాటులోకి వచ్చి మరింత మందికి చేరువ కావడంతో.. నయనతార మీద, చిత్రబృందం మీద తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

![]() |
![]() |