![]() |
![]() |

గోపిచంద్ ( gopichand) నుంచి కొత్త మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసే అభిమానులకి ఈ రోజు వాళ్ళలైఫ్ లో మరిచిపోని రోజుగా మిగిలిపోనుంది. ఎందుకంటే ఈ రోజు గోపీచంద్ నయా మూవీ భీమా ( Bhimaa) టీజర్ రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో కేజీఎఫ్,సలార్ స్థాయిలో టీజర్ ఉందనే ప్రశంసల్ని అందుకుంటు టాక్ అఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయ్యింది..
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అఖండ మానవాళి కోసం యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనే శ్లోకాన్ని చెప్తాడు. కృష్ణుడు చెప్పిన ఆ శ్లోకంతో భీమా టీజర్ స్టార్ట్ అయ్యింది. పైగా ఒక పురాతన శివాలయాన్ని చూపిస్తు ఆ శ్లోకం వస్తుంటే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంది. అలాగే రాక్షసులని చంపే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడని చెప్పి గోపిచంద్ ని చూపించడం అయితే రియల్లీ సూపర్ గా ఉంది. అలాగే ఎద్దు మీద గోపిచంద్ కూర్చుని ఉన్న స్టిల్ నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో ఉంది మూవీ కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేసే పరిస్థితిని తీసుకొచ్చింది.ఈ మూవీలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా కనపడబోతున్నాడు.టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా గోపిచంద్ భీమాతో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు.

భీమా మూవీకి ప్రముఖ కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వం వహించగా కేజీఎఫ్ ,సలార్ లకి మ్యూజిక్ ని అందించిన రవి బర్సుర్ (ravi basrur) సంగీతాన్ని అందిస్తున్నాడు. గోపిచంద్ తో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ లు జత కట్టగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కే కే రాధామోహన్ అత్యంత భారీ ఎత్తున భీమాని నిర్మిస్తున్నాడు. పిబ్రవరి 16 న మూవీ విడుదల కానుంది.
![]() |
![]() |