![]() |
![]() |

ఇప్పుడు ఒక తెలుగు సినిమా సాధించిన కలెక్షన్ ల వివరాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ప్రభాస్ (prabhas) సినిమాకి ముందు ప్రభాస్ సినిమా తర్వాత అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సలార్ (salaar) తో వచ్చి ప్రభాస్ సృష్టించిన రికార్డులు ఆ విధంగా ఉన్నాయి. తాజాగా సలారోడు నైజాంలో ఒక సరికొత్త సునామీని సృష్టించాడు.
నైజాం ఏరియాలో సలార్ 100 కోట్ల గ్రాస్ ని సాధించింది. కేవలం 14 రోజులకే సలార్ ఆ స్థాయిలో కలెక్షన్స్ ని సాధించడం ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు. దీంతో ప్రభాస్ కి తెలంగాణలో ఉన్న ఇమేజ్ మరో సారి అందరికి అర్ధం అయ్యింది. సలార్ ని తెలంగాణాలో రిలీజ్ చేసిన మైత్రి మూవీస్ (mythri movies) వారు సలార్ 100 కోట్లు సాధించిన సందర్భంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

డిసెంబర్ 22 న విడుదలైన సలార్ లోని ప్రభాస్ నట విశ్వరూపానికి పాన్ ఇండియా ప్రేక్షకులు మొత్తం జేజేలు పలికారు. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 650 కోట్లకి పైగా సాధించిన ఈ మూవీలో శృతి హాసన్, జగపతిబాబు, శ్రీయ రెడ్డి, పృథ్వీ రాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రశాంత్ నీల్ ( prashanth neel) దర్శకత్వంలో హోంబులే ఫిలిమ్స్ సలార్ ని నిర్మించింది.
![]() |
![]() |