![]() |
![]() |

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహేష్ ( mahesh) అభిమానుల్లో గుంటూరుకారం సందడి మొదలయ్యింది. జనవరి 12 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా మూవీకి సంబంధించిన నయా న్యూస్ ఒకటి మహేష్ అభిమానులని షాక్ కి గురిచేస్తుంది.
రేపు గుంటూరుకారం( Guntur kaaram) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని కొన్ని రోజుల క్రితం మేకర్స్ నుంచి అధికారకంగా అనౌన్సుమెంట్ చేసారు. కానీ రేపు ఈవెంట్ జరగడం లేదు. హైదరాబాద్ లో ఉన్న యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఫంక్షన్ జరిపితే అభిమానుల రద్దీ ఎక్కువుగా ఉంటుందని తద్వారా ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. త్వరలోనే తిరిగి ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందో చెప్పటంతో పాటుగా ప్లేస్ ని కూడా మేకర్స్ ప్రకటిస్తారు.
గుంటూరుకారంలో మహేష్ సరసన శ్రీలీల ( sreeleela) మీనాక్షి చౌదరి లు జోడి కడుతుండగా త్రివిక్రమ్ (trivikram) రచనా దర్శకత్వాన్ని వహించాడు. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించగా థమన్ సంగీతాన్ని అందించాడు.
![]() |
![]() |