![]() |
![]() |
ప్రతి సంక్రాంతికి సినిమాల రిలీజ్ విషయంలో చాలా గొడవలు, కొన్ని సర్దుబాట్లు తప్పనిసరి అయిపోయింది. ఇక ఈ సంక్రాంతి అవి కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అందరికీ సంక్రాంతి రిలీజే కావాలి కాబట్టి ఈ విషయంలో వివాదాలు తప్పడం లేదు. గత కొన్ని రోజులుగా సినిమాల రిలీజ్ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించారు.
సంక్రాంతికి ‘హనుమాన్’ చిత్రం రిలీజ్ ఉంటుందా అని డైరెక్ట్‌గా అడగకుండా ‘ఖాళీగా ఉందని జూబ్లిహిల్స్ రోడ్డు మీదకు ఓ కుర్రాడు సైకిల్‌పై వచ్చాడు. అదే టైమ్‌కి అక్కడికి నాలుగు కార్లు, రెండు బైకులు వచ్చాయి. నేను ముందు వచ్చానని ఆ కుర్రాడు అక్కడే ఉంటాడా.. పక్కకు వెళ్లిపోతాడా’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ప్రశాంత్‌వర్మ సమాధానమిస్తూ ‘నేనైతే అక్కడే ఉంటాను. అది సైకిల్ అయినా సరే. సైకిల్‌కి కూడా ఎక్కువ పవర్ ఉండొచ్చు కదా. సైకిల్‌తో గుద్దితే కారుకు సొట్ట పడొచ్చు. రిస్క్ చెయ్యకపోతే ఏదీ దక్కదు. నేను సినిమాల విషయమే తీసుకుంటే రెగ్యులర్ సినిమాలు చేయకుండా విభిన్నమైన దారిలోనే వెళ్లాను. నేను చేసిన సినిమాలన్నీ రిస్క్‌తో కూడుకున్నవే. సంక్రాంతికి మూడు సినిమాలు ఆడతాయి. ఈ విషయంలో తేజ కొంచెం టెన్షన్ పడుతున్నాడు. నా ప్రొడ్యూసర్ సినిమాని ఎక్కువ నమ్ముతున్నారు. చూద్దాం. ఏం జరుగుతుందో..మా సినిమా పోటీగా వస్తున్నందుకు కొంతమందికి కోపంగా ఉంది. సెన్సార్ విషయంలో అడ్డంకులు వస్తే.. వాటిని సాల్వ్ చేశాం. మా సినిమా రిలీజ్ అవ్వకుండా చెయ్యాలని కొందరు ప్రయత్నిస్తున్నారు’’ అని అన్నారు.
![]() |
![]() |