![]() |
![]() |
గురూజీ ఓ మంచి గురూజీ.. పవన్ కళ్యాణ్‌కి అత్తారింటి దారేది ఇచ్చావు, అల్లు అర్జున్‌కి అల వైకుంఠపురములో ఇచ్చావు, ఎన్టీఆర్‌కి అరవింద సమేత ఇచ్చావు, మరి మా మహేష్‌కేంటి.. ఖలేజా ఇచ్చావ్..గురూజీ.. సరే ఇస్తే ఇచ్చావ్ ఇప్పుడైనా గుంటూరు కారంతో ఇండస్ట్రీ హిట్ ఇస్తావనుకుంటేఈ పిల్ల చేష్టలు ఏంటి గురూజీ. ఒక్క విషయం గురూజీ అసలు నువ్వు సినిమా చేస్తుంది సూపర్‌స్టార్ మహేష్‌తోనా లేక బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబుతోనా? ఏ ముహూర్తాన గుంటూరు కారం సినిమా మొదలైందో తెలీదుగానీ అభిమానుల గుండెల్లో మాత్రం ఆందోళన మొదలవుతోంది. షూటింగ్ ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు ఆర్టిస్టుల పరంగా, టెక్నీషియన్స్ పరంగా ఎన్నో అపశృతులు. మా మహేష్‌బాబు కెరీర్‌లో ఏ సినిమాకీ జరగనంత డ్యామేజీ ఈ సినిమా జరుగుతుందేమోనన్న టెన్షన్ మొదలైంది.. ‘గుంటూరు కారం’ గురించి, త్రివిక్రమ్ గురించి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేశాడు ఓ అభిమాని. ఈ మాటలు విన్న తర్వాత డీప్‌గా ఆలోచిస్తే అతను చెప్పినదాంట్లో నిజం లేకపోలేదు అని ఎవరికైనా అనిపిస్తుంది.
త్రివిక్రమ్ శ్ర్రీనివాస్.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్. తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి కలిగిన దర్శకుడు. తన మాటల గారడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని బుట్టలో వేసుకున్న దర్శకుడు. అతను డైరెక్ట్ చేసిన సినిమాలంటే కుటుంబ సమేతంగా చూడొచ్చు అనే ముద్ర వేసుకున్న డైరెక్టర్. ఎలాంటి వల్గారిటీ లేని డైలాగ్స్, ఎబ్బెట్టుగా అనిపించని హాస్యం.. వెరసి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చెయ్యడంలో దిట్ట. అలాంటి త్రివిక్రమ్‌కి ఏమైంది?.. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు?.. క్లాస్ నుంచి మాస్‌కి, మాస్ నుంచి ఊరమాస్‌కి.. ఇప్పుడు మరింత కిందకి వెళ్లిపోతున్నాడు. నిన్న ‘కుర్చీని మడపెట్టి..’ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో అందరూ త్రివిక్రమ్‌ని ఉతికేస్తున్నారు. సినిమా ఎలా ఉంటుందో తెలీదుగానీ, నెటిజన్ల ఉతుకుడు మాత్రం చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని అంటున్నారు.
![]() |
![]() |