![]() |
![]() |
సంక్రాంతి పండగ వస్తోందంటే నిర్మాతల్లో టెన్షన్ మొదలవుతుంది. ఏ సినిమా తమ సినిమాకి పోటీగా వస్తుందో, థియేటర్స్ సాలిడ్‌గా దొరుకుతాయో లేదో, బరిలో ఉన్న సినిమాల మధ్య తమ సినిమా ఏమవుతుందో వంటి రకరకాల టెన్షన్స్ నిర్మాతలకు ఉంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి కూడా అదే తరహా వాతావరణం క్రియేట్ అయ్యిందని చెప్పాలి. ఇప్పటికే నా సామిరంగ, సైంధవ్, గుంటూరు కారం, ఈగిల్, హనుమాన్ వంటి తెలుగు సినిమాలు బరిలో ఉన్నాయి. వీటికి తోడు మరో మూడు డబ్బింగ్ సినిమాలు కూడా లైన్‌లోకి వచ్చాయి. అందులో రజినీకాంత్ లాల్ సలామ్ కూడా ఉంది. అయితే తాజా సమాచారం మేరకు లాల్‌సలామ్ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుందట. ఈ సీజన్‌లోనే రజినీకాంత్ అల్లుడు ధనుష్ కెప్టెన్ మిలర్ రిలీజ్ కావడం ఒక కారణమైతే, తెలుగులో రిలీజ్ అవుతున్న స్ట్రెయిట్ సినిమాల మధ్య తమ సినిమా నలిగిపోతుందన్న అభిప్రాయం ఒక పక్క.. దీంతో లాల్‌సలామ్‌ను పోస్ట్ పోన్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు. శివకార్తికేయన్ హీరోగా రూపొందిన అయలన్ మాత్రం పోటీలోనే ఉందని సమాచారం.
రజినీకాంత్ నటించిన సినిమా అయినప్పటికీ లాల్‌సలామ్ మీద అంత బజ్ లేదు. ఎందుకంటే ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించడం, రజినీ క్యారెక్టర్ ఎంత సేపు ఉంటుందనే విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల జనరల్‌గా రజని సినిమాకి వచ్చినంత క్రేజ్ ఈ సినిమాకు రాలేదు. అయితే జైలర్‌తో రజనీ మార్కెట్ విపరీతంగా పెరగడంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు రజనీనే హైలైట్ చేస్తూ ప్రమోషన్స్ చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. ప్రమోషన్స్‌ను కూడా తాత్కాలికంగా ఆపేశారు. ఇక విక్రమ్ కొత్త సినిమా జనవరి 26న రిలీజ్ అవ్వాల్సింది. కానీ, అది కూడా సమ్మర్‌కి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ డేట్‌ని లాల్ సలామ్ కోసం నియోగించుకోవచ్చు. మరి ఈ విషయంలో మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
![]() |
![]() |