![]() |
![]() |
సన్ని లియోన్ గురించి తెలియనివారంటూ ఉండరు. అంతర్జాతీయంగా నీలి చిత్రాల నటిగా ఎంతో పాపులర్ అయిన సన్నీ ఇప్పుడు ఆ కెరీర్‌కి గుడ్‌బై చెప్పి మంచి నటి అని పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది. 42 ఏళ్ళ సన్ని లియోన్ సౌత్‌లో, నార్త్‌లో సినిమాలు చేస్తోంది. మొదట్లో హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసిన సన్నీ ఆ తర్వాత తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది. మంచు ఫ్యామిలీతో సన్నికి మంచి అనుబంధం ఉంది. అందుకే ఆ మధ్య విష్ణుతో కలిసి కొన్ని ఫన్సీ షోస్ చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది.
ఇప్పుడు కన్నడ, మలయాళ భాషల్లోనూ నటిస్తోంది. తాజాగా మలయాళంలో ఓ భారీ వెబ్ సిరీస్‌లో నటించబోతోంది సన్ని. భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఓటీటీ వేదికగా విడుదల కాబోతున్న సినిమాకు ఓకే చెప్పింది సన్ని. ‘పాన్ ఇండియన్ సుందరి’ పేరుతో సన్ని ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్‌ను సతీష్‌వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. మలయాళంలో రూపొందే ఈ వెబ్‌సిరీస్ 5 భాషల్లో విడుదల కానుంది. ఇందులో శ్రీకాంత్ మాళవిక, అప్పని శరత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సన్ని లియోన్‌కి ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు ‘పాన్ ఇండియన్ సుందరి’ మేకర్స్ గట్టి ప్లానే వేశారు. పాన్ ఇండియన్ సుందరి అనే యాప్ట్ టైటిల్‌తో సన్ని లియోన్ ప్రధాన పాత్రలో రూపొందే ఈ వెబ్ సిరీస్ తప్పకుండా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
![]() |
![]() |