![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'గుంటూరు కారం'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే, తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట 'ధమ్ మసాలా' ఆకట్టుకుంది. అయితే రీసెంట్ గా రిలీజయిన రెండో పాట 'ఓ మై బేబీ' మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ సాంగ్ ట్యూన్, లిరిక్స్ పట్ల మహేష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో పెట్టుకొని, నెక్స్ట్ రిలీజ్ చేయబోయే సాంగ్ విషయంలో మూవీ టీమ్ కి మహేష్ క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో షూట్ చేయబోయే మాస్ సాంగ్ పై రీవర్క్ చేయాలని మహేష్ సూచించినట్లు సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలను నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఖండించారు.
"గుంటూరు కారం సినిమాలో నాలుగు ఫుల్ సాంగ్స్, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. ఇప్పటికే మూడు పాటలు, ఒక బిట్ సాంగ్ షూటింగ్ పూర్తి చేశాం. మా షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 21 నుంచి చివరి పాటను చిత్రీకరించబోతున్నాం. పాటల విషయంలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. కొందరు గాసిప్ రాయుళ్లకు మీ అటెన్షన్ అవసరం. వారు కేవలం క్లిక్‌ల కోసం ఫేక్ వార్తలను వ్యాప్తి చేస్తున్నారు." అంటూ నాగవంశీ తనదైన శైలిలో ఘాటుగానే స్పందించారు.

హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |