![]() |
![]() |

విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్టైనర్ తో సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టడం అక్కినేని నాగార్జునకు సెంటిమెంట్ గా మారింది. 2024 సంక్రాంతికి కూడా అలాంటి పల్లెటూరు నేపథ్యమున్న మాస్ ఎంటర్టైనర్ తోనే రాబోతున్నాడు. అదే 'నా సామి రంగ'. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
ఇప్పటికే విడుదలైన 'నా సామి రంగ' గ్లింప్స్ కి, ఇతర ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆదివారం విడుదలైన టీజర్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది. "ఏం సేత్తున్నాడేంటి మీవోడు" అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. "నిన్నే మావిడి తోటలో 20 మందిని ఊతకొట్టుడు కొట్టేశాడు" అంటూ అల్లరి నరేష్ చెబుతుండగా.. మామిడి తోటలో ఫైట్ సీన్ తో నాగార్జున ఇంట్రడక్షన్ అదిరింది. లవ్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఫుల్ మీల్స్ లా ఉంది టీజర్. ముఖ్యంగా టీజర్ చివరిలో నాగ్ కత్తి పట్టడం టీజర్ కే హైలైట్ గా నిలిచింది.

ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఆశిక రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్ నటిస్తున్నారు.
![]() |
![]() |