![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే ఎంతో అభిమానం. ఎన్నో సందర్భాల్లో తన అభిమానాన్ని చాటుకున్నాడు. 'డాన్ శీను' వంటి సినిమాల్లో అమితాబ్ అభిమానిగా కూడా కనిపించాడు. కాగా బిగ్ బి పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు మాస్ రాజా. ఆయన తాజా సినిమాకి 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్ ఖరారు చేశారు.
షాక్, మిరపకాయ్ చిత్రాల తర్వాత రవితేజ, హరీష్ శంకర్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రకటన ఇటీవల వచ్చింది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర టైటిల్ ని 'మిస్టర్ బచ్చన్'గా రివీల్ చేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. బ్యాక్ గ్రౌండ్ లో అమితాబ్ ఇమేజ్ కనిపిస్తుండగా.. స్కూటర్ పై కూర్చొని ఉన్న రవితేజ స్టైల్ ఆకట్టుకుంటోంది. అలాగే ఆదివారం నాడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

![]() |
![]() |