![]() |
![]() |

'హాయ్ నాన్న' రూపంలో నేచురల్ స్టార్ నాని ఖాతాలో మరో హిట్ చేరింది. డిసెంబర్ 7న విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా భారీ ఓపెనింగ్స్ ని రాబట్టలేకపోయినప్పటికీ.. పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు రాబడుతూ పది రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది.
రూ.27.60 థియేట్రికల్ బిజినెస్ చేసిన హాయ్ నాన్న మూవీ.. పది రోజుల్లో రూ.29.54 కోట్ల షేర్ రాబట్టి క్లీన్ హిట్ గా నిలిచింది. పది రోజుల్లో నైజాంలో రూ.9.65 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.2.21 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.6.38 కోట్ల షేర్ తో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.18.24 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.3.48 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.7.82 కోట్ల షేర్ కలిపి ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా రూ.29.54 కోట్ల షేర్ రాబట్టింది.
పదో రోజు శనివారం కావడంతో రూ.2.10 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన హాయ్ నాన్న.. 11వ రోజయిన ఆదివారం కూడా మరో రెండు కోట్ల షేర్ రాబట్టే ఛాన్స్ ఉంది.
![]() |
![]() |