![]() |
![]() |

మహేష్ బాబు నటిస్తున్న "గుంటూరు కారం" మూవీ ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇక సెకండ్ సాంగ్ "ఓహ్ మై బేబీ" సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అయింది..కానీ ఈ సాంగ్ కాస్త కాంట్రవర్సీ అయింది. ఈ సాంగ్ కి తమన్ ట్యూన్ బాగోలేదని కొందరు, లిరిక్స్ బాలేవని ఇంకొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ థమన్ ని, రామజోగయ్య శాస్త్రిని తెగ ట్రోల్ చేశారు. నెటిజన్స్ ట్రోలింగ్స్ కి ఫీలైన సరస్వతీ పుత్రుడు, పాటల రాచయిత రామజోగయ్య శాస్త్రి ఒళ్లు దగ్గర పెట్టుకోమంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ట్విట్టర్ నుంచి కనిపించకుండా పోయారు.
తమన్ ఓల్డ్ ట్యూన్ ని మార్చేసి సెట్ చేశాడని.. లిరిక్స్ అస్సలు బాలేవంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేసి రామజోగయ్య శాస్త్రిని, నిర్మాత సూర్య దేవర నాగవంశీని, తమన్ ను ట్యాగ్ చేశాడు. దీంతో ఓ మై బేబీ సాంగ్ పై వస్తున్న విమర్శలపై సీరియస్ అయ్యాడు రామజోగయ్య శాస్త్రి. సోషల్ మీడియా కుక్కల చేతుల్లోకి వెళ్లిపోతుదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే పాటలు బాగుంటే అందరూ పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారు.
అదే సాంగ్ బాలేదంటే విమర్శలను రిసీవ్ చేసుకోలేరా అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. సాంగ్స్ బాలేదనేసరికి మహేష్ ఫాన్స్ ని కుక్కలతో పోలుస్తూ తిట్టారు. అదే సాంగ్స్ బాగున్నాయంటే ఇలా తిడతారా అని ప్రశ్నిస్తున్నారు. పాటలు బాగున్నాయంటే ఇలా కుక్కలతో పోలుస్తూ విమర్శకులు తిట్టరు కదా అని నెటిజన్స్ అంటున్నారు. ఇంకొందరైతే మాత్రం మహేష్ బాబుకి సాంగ్స్ రాయొద్దు అని సలహా ఇస్తే...తమన్‌ను మ్యూజిక్ చేయొద్దంటూ చెప్పారు. ఇంకొకరైతే సరస్వతి పుత్ర అన్న బిరుదు తీసేయాలంటూ సూచించారు. ఇలా నెటిజన్స్ రామజోగయ్య శాస్త్రి మీద మాటల దాడి చేస్తున్నారు.
![]() |
![]() |