![]() |
![]() |

తెలుగు సినిమాకి సరికొత్త హంగులని అద్దటంతో పాటు తెలుగు సినిమా హీరోకి ఒక స్టార్ స్టేటస్ ని తీసుకొచ్చిన దర్శకుడు రాఘవేంద్ర రావు.ఒక మామూలు హీరో అగ్ర హీరో రేంజ్ కి ఎదగాలంటే ఆయన సినిమాలో హీరోగా చేస్తే చాలు ఇంక ఆ హీరో అగ్రహీరో అవ్వడంతో పాటుగా ఎంతో మంది ఫ్యాన్ బేస్ ని కూడా సంపాదించుకుంటాడు. అలాగే ఆయన సినిమాలో నటించిన హీరోయిన్ కూడా అగ్ర హీరోయిన్ గా మారి అగ్ర హీరోలకి ధీటుగా కూడా ఎదుగుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.తన సినిమాల్లో వచ్చే పాటలని ఎంతో కళాత్మకంగా,అందంగా తీర్చి దిద్ది సినిమాలో పాటలు వస్తే బయటకి వెళ్లే ప్రేక్షకులని థియేటర్స్ లో కూర్చునేలా చెయ్యడమే కాకుండా పాటల కోసమే ప్రేక్షకులు రిపీటెడ్ గా సినిమాకి వచ్చేలా చేసింది కూడా రాఘవేంద్రరావు గారే. తాజాగా ఆయన ఒక సినిమా ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల యాంకర్ సుమల కొడుకు రోషన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం బబుల్‌గమ్..నిన్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాఘవేంద్ర రావు గారు మాట్లాడుతు కొడుకు హీరో అవుతుండటంతో సుమ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. అలాగే ఈ బబుల్‌గమ్ లో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది.ఇద్దరు చాలా సార్లు ముద్దు పెట్టుకున్నారు కాబట్టి సినిమా చాలా బాగా ఆడుతుందని ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చే సినిమాల్లో ముద్దు లేకపోతే ఆ సినిమా ఆడదనే టాక్ ఉందని రాఘవేంద్రరావు గారు అలా చమత్కారంగా చెప్పేసరికి హీరో హీరోయిన్లతో సహా అక్కడున్న వాళ్ళందరు ఒక్కసారిగా నవ్వారు.
.webp)
అలాగే మనం నోట్లో వేసుకునే బబుల్‌గమ్ ఎలా అయితే మెల్లగా మెల్లగా ఉబ్బి ఒక్కసారిగా టప్ మని పేలుతుందో అలాగే ఈ సినిమా టాక్ కూడా నిదానంగా స్టార్ట్ అయి సూపర్ హిట్ అనే టాక్‌తో ఎండ్ అవ్వాలని కోరుకుంటున్నాను అని కూడా ఆయన చెప్పారు. డిసెంబర్ 29 న విడుదల అవుతున్న ఈ బబుల్‌గమ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. రోషన్ సరసన మానస చౌదరి హీరోయిన్ గా చేస్తుండగా రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్నాడు.
![]() |
![]() |