![]() |
![]() |

ఇళయ దళపతి విజయ్ తాజాగా లియోతో మంచి హిట్ ని అందుకున్నాడు. ఆయన గత చిత్రం వారిసు అంతగా ప్రేక్షకాదరణ పొందకపోయినప్పటికీ లియో మాత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది. విజయ్ తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ క్యారక్టర్ కి సంబంధించిన ఒక వార్త తమిళ చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపుతుంది.
విజయ్ 68 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ తన క్యారక్టర్ నిమిత్తం రకరకాల గెటప్స్ లో కనిపిస్తాడు. అందులో భాగంగా 19 సంవత్సరాల వయసు కుర్రవాడిగా కూడా విజయ్ కనిపించాలి. ఇందుకోసం సుమారు 6 కోట్ల రూపాయిల ఖర్చుతో కూడిన ఒక కొత్త టెక్నాలజీ ని వెంకట్ ప్రభు తీసుకొస్తున్నాడు.అంటే విజయ్ స్క్రీన్ మీద అచ్చం 19 ఏళ్ళ వయసు వాడిలా కనపడి ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఈ విషయం టాక్ అఫ్ ది తమిళ ఇండస్ట్రీ అయ్యింది. వాస్తవానికి విజయ్ ని 19 ఏళ్ళ వయసువాడిగా చూపించడానికి అందుబాటులో ఉన్న కొన్ని మేకప్స్ ని పరిశీలించారు. కానీ అవి విజయ్ కి ఏ మాత్రం సూట్ అవ్వలేదు. ఇలాంటి మేకప్ నే మొన్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో యంగ్ రవితేజ క్యారక్టర్ కి వేశారు. అప్పుడు కూడా ఆ మేకప్ అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు
కాగా ప్రస్తుతం తమిళ నాట విజయ్ నటిస్తున్న చివరి చిత్రం వెంకట్ ప్రభుదే అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక విజయ్ పూర్తిగా రాజకీయాల్లో కి వస్తాడని అంటున్నారు. విజయ్ రాజకీయాల్లో ఎంత సంచలనం సృష్టిస్తాడో తెలియదు గాని ప్రస్తుతం అయితే సినిమాలోని తన క్యారక్టర్ కి సంబంధించిన మేకప్ కి మాత్రం 6 కోట్లు ఖర్చుపెడుతు సంచలనం సృష్టిస్తున్నాడు.
![]() |
![]() |