![]() |
![]() |

నటి సమంత కొత్త అవతారం ఎత్తింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి తిరుగులేని క్రేజ్ ని సంపాదించుకున్న సమంత.. అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలంగా సినిమాల్లో వేగం తగ్గించింది. ఈ ఏడాది తెలుగులో 'శాకుంతలం', 'ఖుషి' సినిమాలతో పలకరించిన ఆమె కొత్త సినిమాలు కమిట్ అవ్వలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో 'చెన్నై స్టోరీస్' అనే ఇంగ్లీష్ ఫిల్మ్, 'సిటాడెల్' అనే హిందీ వెబ్ సిరీస్ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె నిర్మాతగా పరిచయమవుతుంది.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో సమంత కొత్త నిర్మాణ సంస్థను స్థాపించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సామ్.. తనకు ఇష్టమైన పాటల్లో ఒకటైన 'బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్'లోని పదాన్ని తీసుకొని ఈ పేరు పెట్టినట్లు తెలిపింది. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అద్భుతమైన కథలను ఈ వేదిక నిర్మించనున్నట్లు సమంత వెల్లడించింది.

![]() |
![]() |