![]() |
![]() |

జులైలో వచ్చి ఘన విజయం సాధించిన బేబీ సినిమా తాలూకు గుర్తులని ఇంకా ఎవరు మర్చిపోలేదు. ఆ మూవీలో టైటిల్ రోల్ లో వైష్ణవి చైతన్య ప్రదర్శించిన నటనకి వర్షాలని సైతం లెక్కచేయకుండా యూత్ మొత్తం థియేటర్స్ కి పరుగులు తీసింది. అలాగే ఎంతో మంది ఆ మూవీతో వైష్ణవికి అభిమానులుగా కూడా మారారు.ఇప్పుడు వైష్ణవి గురించి ఫిలింనగర్ లో వినిపిస్తున్న ఒక మాట ఆమె అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులని షాక్ కి గురి చేస్తుంది.
బేబీ సినిమా తర్వాత వైష్ణవి నుంచి ఇంకా ఎలాంటి కొత్త సినిమా స్టార్ట్ అవ్వలేదు.ఆమె కొత్త సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న టైం లో ఇప్పుడు పూరి జగన్నాధ్ ,రామ్ పోతినేని ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ లో వైష్ణవి ఒక ఐటెం సాంగ్ లో నర్తించబోతుందని అంటున్నారు.ఇప్పుడు ఈ వార్తతో ఆమె అభిమానులు షాక్ కి గురవుతున్నారు. ఈ వార్త నిజం కాకూడదని కోరుకుంటున్నారు. ఎందుకంటే బేబీ విజయంలో కీలక పాత్ర పోషించిన వైష్ణవి అగ్ర హీరోయిన్ రేంజ్ కి వెళ్తుందని భావిస్తున్న వేళ కేవలం రెండో సినిమాకే ఐటెం సాంగ్ చెయ్యడం ఆమె కెరీర్ కి మంచిది కాదని అంటున్నారు.
అసలు కొన్ని రోజుల క్రితం డబుల్ ఇస్మార్ట్ లో సెకండ్ హీరోయిన్ గా వైష్ణవిని ఎంపిక చేసారు అనే వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తెలిసింది. ఇప్పుడేమో అదే సినిమాలో వైష్ణవి ఐటెం సాంగ్ చెయ్యబోతుందనే వార్తలు వస్తున్నాయి. అసలు నిజం ఏంటో కొన్ని రోజులు అయితే గాని తెలియదు.అలాగే సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే వైష్ణవి అయినా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
![]() |
![]() |