![]() |
![]() |
.webp)
రామాయణాన్ని ఇతివృత్తంగా చేసుకొని పాన్ ఇండియా హీరో ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతమ్మగా సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడుగా వచ్చిన మూవీ ఆదిపురుష్. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలయిన ఆదిపురుష్ మూవీ హిందువుల దగ్గర తీవ్ర వ్యతిరేకతని మూటగట్టుకుంది ప్రభాస్ మీద కూడా పలు రకాల విమర్శలు వచ్చాయి.కానీ ఇప్పుడు ఆదిపురుష్ మూవీ ప్రభాస్ నటిస్తున్న ఇతర సినిమాల కంటే గొప్పదనే టాక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ప్రభాస్ తో ఆదిపురుష్ ని తెరకెక్కించిన దర్శకుడు ఓంరౌత్ ఆ సినిమా విషయంలో ఎన్ని విమర్శలు ఎదుర్కున్నా కూడా ఒక్క విషయం లో మాత్రం అందరి చేత ఓంరౌత్ గ్రేట్ అని అనిపించుకుంటున్నాడు. ఎందుకంటే
ఆదిపురుష్ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు కూడా మేకర్స్ వాళ్ళంతట వాళ్ళు ఆదిపురుష్ సినిమాకి సంబంధించిన ప్రభాస్ అండ్ ఇతర ఆరిస్టుల పిక్స్ ని బయటకి విడుదల చేసే వరకు ఆ మూవీకి సంబంధించిన ఒక్క స్టిల్ కూడా ఎక్కడ లీక్ అవ్వలేదు. అందుకే ఈ విషయంలో దర్శకుడు ఓంరౌత్ ని అందరు మెచ్చుకుంటున్నారు .
ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సలార్ నుంచి ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న ప్రభాస్ సినిమాలకి సంబంధించిన ఏదో ఒక ఫోటో బయటకి లీక్ అయ్యి సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతునే ఉంది. తాజాగా కల్కి నుంచి కూడా కొన్ని పిక్స్ బయటకి వచ్చాయి. అందుకే ఆదిపురుష్ ని లీక్ ల నుంచి కాపాడి ఓం రౌత్ గ్రేట్ అనిపించుకున్నాడని అంటున్నారు. అలాగే ప్రభాస్ ని కూడా రాముడు కాపాడాడు అని అంటున్నారు.
![]() |
![]() |