![]() |
![]() |

నటి మంచు లక్ష్మిని అల్లు హీరో శిరీష్ ముద్దు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోని స్వయంగా మంచు లక్ష్మి షేర్ చేయడం విశేషం.
రీసెంట్ గా మెగా ఇంట దీపావళి పార్టీ ఘనంగా జరిగింది. ఈ పార్టీకి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అందులో మంచు లక్ష్మి కూడా ఉంది. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను తాజాగా లక్ష్మి సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫొటోలలో చిరంజీవి, వెంకటేష్, రామ్ చరణ్, అమల, అఖిల్, మనోజ్ సహా పలువురు ఉండటం గమనించవచ్చు. అయితే ఈ ఫొటోలలో శిరీష్ ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఫొటోలో లక్ష్మిని శిరీష్ బుగ్గ మీద కిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాని ఊపేస్తోంది.
![]() |
![]() |