![]() |
![]() |

నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నయా పిక్చర్ సరిపోదా శనివారం. టైటిల్ ప్రకటించినప్పటి దగ్గర నుంచే నాని ఫ్యాన్స్ లో ను మూవీ లవర్స్ లోను అలాగే సినీ ట్రేడ్ సర్కిల్స్ లోను సరిపోదా శనివారం పిక్చర్ మీద మంచి బజ్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని తమ ముందుకొస్తుందా అని అందరు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈమూవీ కి సంబంధించిన తాజా అప్ డేట్ అండ్ వీడియో సోషల్ మీడియాలో నయా హల్ చల్ చేస్తుంది.
సరిపోదా శనివారం మూవీ షూటింగ్ ఒక యాక్షన్ ఎపిసోడ్ తో దీపావళి సందర్భంగా అదే రోజు ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్నీ డివివి ఎంటర్టైన్మెంట్స్ తమ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడి చేసింది. అలాగే షూటింగ్ చేసుకుంటున్న సీన్ తాలూకు వీడియో ఒక దాన్ని కూడా మేకర్స్ తమ అకౌంట్ లో ఉంచారు. ఆ వీడియోలో నాని చుట్టూ మంటలు వస్తుంటే నాని ఆ మంటల్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ మూవీలో నానికి ప్రతి నాయకుడిగా సూర్య నటిస్తున్న విషయాన్ని మేకర్స్ ఇదివరకే ప్రకటించిన నేపథ్యం లో ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఆ మంటల్ని ఎస్ జె సూర్య ఏర్పాటు చేసాడేమో అని అనుకుంటున్నారు.

నాని వివేక్ ఆత్రేయల కాంబోలో ఆల్రెడీ అంటే సుందరానికి అనే మూవీ వచ్చి మంచి విజయం సాధించడంతో ఇప్పుడు సరిపోదా శనివారం మీద కూడా అందరిలోను మంచి అంచనాలే ఉన్నాయి. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. మిగతా ఆర్టిస్టుల వివరాలు కూడా త్వరలోనే తెలుస్తాయి. జేక్స్ బిజోయ్ సంగీత సారధ్యాన్ని వహిస్తున్నాడు.
![]() |
![]() |