![]() |
![]() |
.webp)
సల్మాన్ ఖాన్ తాజా చిత్రం టైగర్ 3 మొన్న దీపావళికి విడుదలయ్యి మంచి టాక్ తోనే ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ అయినా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అయినా ఇంకా ఏ ఇతర భాషకి సంబంధించిన సినిమా అయినా సరే ఇప్పుడు ఆ సినిమా ఎన్ని రోజులు ఆడింది అనే కంటే ఎంత కలెక్షన్లు వసూలు చేసింది అనే దాని మీదే ఆ చిత్రం యొక్క రేంజ్ ఆధారపడి ఉంది. తాజాగా సల్మాన్ టైగర్ 3 కలెక్షన్స్ అండ్ షారుక్ జవాన్ కలెక్షన్స్ ల మధ్య చర్చ జరుగుతుంది.
టైగర్ 3 సల్మాన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జట్ తో రూపుదిద్దుకుంది. దీపావళి సందర్భంగా విడుదలయిన టైగర్ 3 రెండు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అలాగే ఈ సినిమాకి వస్తున్న కల్లెక్షన్ల ప్రకారం టైగర్ 3 టోటల్ 800 కోట్ల గ్రాస్ దగ్గర ఆగిపోవచ్చని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో అభిమానుల మధ్య సల్మాన్ ,షారుక్ సినిమాల మధ్య చర్చ మొదలయ్యింది. కొన్ని నెలల క్రితం షారుక్ జవాన్ సినిమా వచ్చింది .ఓవర్ ఆల్ గా ఆ మూవీ 1140 కోట్లు పైగానే గ్రాస్ వసూలు చేసింది. దీంతో షారుక్ అభిమానులు తమ హీరో రికార్డు ని సల్మాన్ క్రాస్ చెయ్యడని అంటుంటే సల్మాన్ అభిమానులు మాత్రం మా సల్లు భాయ్ షారుక్ రికార్డు ని అధిగమిస్తాడని అంటున్నారు. ఏది ఏమైనా సల్మాన్ షారుక్ తో శరణం అంటాడో లేక రణం అంటాడో కొన్ని రోజులు అయితే కానీ తెలియదు.
![]() |
![]() |