Home

»

Latest News

మహానటి సినీ ప్రయాణానికి పదేళ్ళు!

Nov 14, 2023 12:15PM

హీరోల డామినేషన్ ఉండే సినీ పరిశ్రమలో హీరోయిన్ గా రాణించడం అంత తేలిక కాదు. పైగా అందాలు ఆరబోయకుండా వరుస సినిమాలలో నటిస్తూ పదేళ్లుగా సత్తా చాటడం మరింత కష్టమైంది. ఆ కష్టాన్ని అధిగమించి హీరోయిన్ గా సత్తా చాటుతోంది మహానటి కీర్తి సురేష్. హీరోయిన్ గా ఆమె సినీ ప్రయాణం మొదలై నేటితో పది వసంతాలు పూర్తయింది.

మలయాళంలో బాలనటిగా కొన్ని సినిమాలు చేసిన కీర్తి సురేష్.. 2013లో వచ్చిన మలయాళ చిత్రం 'గీతాంజలి'తో కథానాయికగా ప్రయాణం మొదలుపెట్టింది.  2013 నవంబర్ 14న విడుదలైన ఈ మూవీ, ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోనప్పటికీ.. నటిగా కీర్తికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత 2015లో 'ఇదు ఎన్న మాయం'తో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కీర్తి.. 2016లో 'నేను శైలజ'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అప్పటినుంచి తమిళ, తెలుగు భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. పలువురు స్టార్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక మహానటి సావిత్రి బయోపిక్ గా రూపొందిన 'మహానటి'లో టైటిల్ రోల్ పోషించి, తన అభినయంతో కట్టిపడేసి, ఈ తరం మహానటిగా పేరుతెచ్చుకుంది. 'నేను శైలజ', 'నేను లోకల్', 'మహానటి', 'దసరా' వంటి పలు హిట్ సినిమాల్లో నటించిన కీర్తి ఈ నవంబర్ 14తో కథానాయికగా పదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com