![]() |
![]() |
.webp)
దర్శక దీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ఆయన కెరీర్ మొదటి నుంచి పరిశీలించిన వారికి బాగా అర్థమవుతుంది. ఒక సినిమా పూర్తి చేసిన తర్వాత గాని రెండో సినిమా విషయంలో ఆయన నుంచి పూర్తిగా క్లారిటీ రాదు. 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ హడావుడి పూర్తి అయిన తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
రాజమౌళి ఒకేసారి మూడు నాలుగు సినిమాలు కమిట్ అయ్యి ఒకదాని తర్వాత ఒకటి చేసే దర్శకుడు కాదు. ఒక సినిమా పూర్తి అయిన తర్వాత కనీసం ఆరు నెలలు గ్యాప్ తో తదుపరి సినిమాను ప్రకటించడం, మొదలు పెట్టడం చేస్తాడు. ఇది తెలుగు మీడియాకు, తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. కానీ తమిళ మీడియాకు తెలియదు. కానీ ఈసారి రాజమౌళి విచిత్రంగా మహేష్ బాబుతో ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ ప్రారంభం కాకముందే 'ఆర్ఆర్ఆర్'కి సీక్వెల్ ఉంటుందని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఎప్పటినుంచో మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొని వస్తున్నారు, మరో వైపు మహేష్ చిత్రాన్ని 'అవతార్' తరహాలో ఫ్రాంచైజీగా తీయనున్నారు. ఇది తెలియక తమిళ్ మీడియా కొత్త పుకార్లు సృష్టించింది.
రాజమౌళి గురించి ఒక వార్త విపరీతంగా అక్కడ చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న రాజమౌళి ఆ తరువాత కమహాసన్‌తో వర్క్ చేయబోతున్నట్టు కథనాలు వస్తున్నాయి. వారి ప్రకారం కమల్- రాజమౌళి కాంబో మూవీ ఫిక్స్ అయింది. మహేష్ బాబు మూవీ పూర్తి అవ్వడమే ఆలస్యం ఈ సినిమా పట్టాలెక్కనుంది అని రాస్తున్నారు. ఈ వార్తలు కచ్చితంగా నిజం అయ్యి ఉండవు అని తెలుగు మీడియా వారి అభిప్రాయం.
'ఆర్ఆర్ఆర్'ను ప్రమోట్ చేయడం పూర్తయిన తర్వాత మహేష్ తో సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ అవుతారు. మహేష్ బాబుతో చేయబోతుంది భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా. దీనిని పలుభాగాలుగా చేయబోతున్నట్టు విజయేంద్రప్రసాద్ చెప్పారు. కనుక కమలహాసన్ తో రాజమౌళి కలిసి పనిచేసే అవకాశం లేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా తమిళ మీడియా వర్గాల ప్రచారం నిజమై దర్శక ధీరుడు రాజమౌళి విశ్వ నటుడు కమలహాసన్ కలిసి నటిస్తే ఆ కాంబో కన్నులపంటే అని చెప్పవచ్చు...!
![]() |
![]() |