![]() |
![]() |
.webp)
2022 చాలా విచిత్రమైన ఏడాదిగా చెప్పుకోవచ్చు. గత ఏడాది బాక్సాఫీస్ వద్దకు ఎన్నో సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ సినిమాలతో పోలిస్తే మన సౌత్ సినిమాలు తమ సత్తా చాటాయి. మరో లెవల్ లో అన్నట్టుగా ఆర్ఆర్ఆర్, కాంతారా, విక్రమ్ సినిమాలు కుమ్మేశాయి. కానీ అల్లు అర్జున్, బాలకృష్ణల నుంచి మాత్రం గత ఏడాది సినిమాలు రాలేదు. 2021 వ సంవత్సరం డిసెంబర్ లో బాలయ్య- బోయపాటిల అఖండ సినిమా వచ్చింది. ఇక అల్లు అర్జున్ -సుకుమారుల పుష్ప-ది రైజ్ కూడా డిసెంబర్‌లోనే విడుదలయ్యింది. కానీ ఈ రెండు చిత్రాల హవా 2022లో కూడా తగ్గలేదు. ఇవి బాక్స్ ఆఫీస్ వద్ద తెగ సందడి చేశాయి. బాక్సాఫీసును కొల్లగొట్టాయి. దాంతో బన్నీ, బాలయ్య సినిమాలు 2022లో అసలు రాలేదు అనే ఫీల్ అభిమానులకు కలగలేదు. కిందటి ఏడాది అంతా పుష్ప1 చిత్రం ఏదో ఒక దేశంలో ఏదో ఒక భాషలో ఆడుతూనే ఉంది. అలా ఈ చిత్రం అందర్నీ కిందటేడాది మాట్లాడుకునేలా చేసింది.
ఇక బాలయ్య కూడా అఖండ చిత్రంతో దాదాపు ఏప్రిల్ వరకు ఆ హవా తగ్గకుండా చూసుకున్నారు. ఆ తరువాత బాలయ్య అన్ స్టాపబుల్ షో, వీరసింహారెడ్డి అప్డేట్స్ తో ఆయన ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చారు. గత ఏడాది మొత్తంలో వీరిద్దరూ హీరోలు ఒక్క సినిమా కూడా విడుదల చేయలేకపోయినా కూడా ఇతర హీరోలతో సమానంగా మరి చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువగా వార్తల్లో నిలిచారు. కనుక వీరి సినిమాలు రాలేదని అభిమానులు నిరాశ చెందలేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్య వీర సింహారెడ్డి గా వస్తున్నారు.
గత ఏడాది తన నుంచి సినిమా రానందున ఈ ఏడాదిలోనే మరో సినిమాతో అంటే అనిల్ రావిపూడి చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, బన్నీ పుష్ప2 సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది సాధ్యమో కాదో తెలియడం లేదు. మొత్తానికి ఒక్క సినిమా కూడా లేకపోయినా బాలయ్య, బన్నీలు తగ్గేదే లే అంటూ జోరు చూపిస్తున్నారు....!
![]() |
![]() |