![]() |
![]() |

తెలుగులో మాస్ రాజా మాస్ మహారాజా రవితేజ కు స్పెషల్ ఇమేజ్ ఉంది. ఎంతో కాలం హిట్స్ లో సాగిన రవితేజ కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. అలాంటి సమయంలో అతనికి మరల ఊపిరి పోసిన చిత్రంగా క్రాక్ మూవీ ని చెప్పుకోవచ్చు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. రవితేజ-గోపీచంద్ మలినేని కాంబోలో డాన్ శీను, బలుపు సినిమాలు వచ్చాయి. హ్యాట్రిక్ కాంబినేషన్ గా వచ్చిన క్రాక్ కూడా బాక్సాఫీస్ కి నాడు కొత్త కళ తెచ్చింది. కోవిడ్ లాక్ డౌన్ తర్వాత బాక్సాఫీస్ ని కళకళలాడించిన చిత్రం క్రాక్. ఆ చిత్రం రవితేజ స్టామినా ఏమిటో ప్రూవ్ చేసింది. ముందుగా అనుకోకపోవడం వలన ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీలో విడుదల చేయలేకపోయారు. కానీ ఇప్పుడు తెలుగులో హిట్ అయింది కాబట్టి హిందీలోకి రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. క్రాక్ బాలీవుడ్ రీమిక్ లో హీరోగా ఎవరు నటిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన దృష్టిలో హిందీలో ఈ సినిమా అజయ్ దేవగన్ గాని రణవీర్ సింగ్ గానీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. ఇద్దరిలో ఎవరితో కుదిరితే వారితో ఈ సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. క్రాక్ హిందీ రీమేక్ మూవీని కూడా గోపీచంద్ డైరెక్ట్ చేస్తారా? అక్కడ ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు? హీరోయిన్‌గా ఎవరు చేస్తారు? వంటి విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమా చేసారు. ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోంది. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ మూవీ గా ఈ సినిమా రూపొందుతోంది. భారీగా సినిమాపై అంచనాలు ఉండడంతో నందమూరి ఫ్యాన్స్ ని, సినీ ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందని గోపీచంద్ మలినేని ఎంతో నమ్మకంతో చెబుతున్నారు. మొత్తానికి క్రాక్ హిందీ వర్షన్ కూడా గోపీచంద్ డైరెక్ట్ చేస్తే తెలుగు నుంచి మరో డైరెక్టర్ బాలీవుడ్‌కి వెళ్లినట్టుగా అవుతుంది...!
![]() |
![]() |