![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి సంచలనాలను నమోదు చేసింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన రామ్ చరణ్‌కు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత ఆయన తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ దర్శకత్వంలో చేసిన 'ఆచార్య' చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు రామ్ చరణ్ కూడా తన 15వ చిత్రంపై ఆసక్తిగా ఉన్నారు. దేశం గర్వించదగ్గర దర్శకుడు రాజమౌళికి దీటైన డైనమిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.
మొదట ఈ సినిమాను 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని భావించారు. కానీ షూటింగ్‌తో పాటు అప్డేట్స్ విషయంలో యూనిట్ సభ్యులు చాలా ఆలస్యం చేస్తున్నారు. దాంతో ఈ ఏడాది జనవరిలో విడుదల చేయాలని భావించిన శంకర్ చిత్రం వాయిదా పడింది. దీని కారణంగా శంకర్ కోర్టు ఆదేశానుసారం 'ఇండియన్ 2' సినిమాను మళ్ళీ మొదలు పెట్టాల్సి రావడంతో చరణ్ సినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
'ఇండియన్ 2' సినిమా ఈ ఏడాది జూన్‌లో రాబోతుంది. అయితే దిల్ రాజు మాత్రం తమ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 'ఇండియన్ 2' సినిమా షెడ్యూల్‌ని బట్టి రామ్ చరణ్ చిత్రం వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్‌లో దసరా కానుకగా రామ్ చరణ్ 15వ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. అది కూడా కుదరకపోతే ఈ ఏడాది డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్‌ను టార్గెట్ చేయబోతున్నారు. మరింత ఆలస్యం అయితే మాత్రం క్రిస్మస్ కాకుండా 2024 సంక్రాంతిని దిల్ రాజు- రామ్ చరణ్- శంకర్ చిత్రం క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.
ఈ భారీ చిత్రానికి సంక్రాంతినే కరెక్ట్ సీజన్ అని దిల్ రాజు అనుకుంటున్నారని సమాచారం. అలా మాత్రం గట్టిగా ఆలోచిస్తే సంక్రాంతి ఆయనకు బెస్ట్ ఆప్షన్. దీన్ని బట్టి ఈ సినిమా 2024 సంక్రాంతికి రావచ్చు అనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27న మాత్రం సినిమాకు సంబంధించిన స్పెషల్ టీజర్‌ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
![]() |
![]() |