![]() |
![]() |

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీకాంత్.ఎన్.రెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు.
నూతన సంవత్సర కానుకగా ఈ చిత్రానికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని ఈరోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో ఈ చిత్రాన్ని 29 ఏప్రిల్, 2023న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. పోస్టర్ లో తీగల కంచె ఆవల అస్పష్టంగా కనిపిస్తూ హీరో నిలుచున్న తీరు, మరో వైపు కంచె తగలబడుతున్న వైనం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తొలిచిత్రం 'ఉప్పెన'తోనే భారీ విజయాన్ని అందుకొని ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్.. ఈ చిత్రంలో మాస్ అవతారంలో సరికొత్తగా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని గతంలో పౌరుషానికి ప్రతీకగా విడుదల అయిన ప్రచార చిత్రం నిరూపించింది.
భారీస్థాయిలో చిత్ర నిర్మాణం జరుగుతోంది. ఇది పూరి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమని చిత్ర దర్శక,నిర్మాతలు అంటున్నారు. ఇప్పటికే సినిమా చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్రం టైటిల్, అలాగే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
![]() |
![]() |