Home  »  News  »  ప్రభాస్ సరే పవన్ సంగతి ఏంటి?

Updated : Jan 1, 2023

నందమూరి నట‌సింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె 2 సీజన్‌లో ఇటీవల ప్రభాస్ తో ఓ ఎపిసోడ్ చేశాడు. ఈ ఎపిసోడ్ మొదటి భాగం డిసెంబర్ 30 న స్ట్రీమింగ్ అయింది. ఇది మిక్స్‌డ్ టాక్‌ని  తెచ్చుకుంది. ఈ ఎపిసోడ్‌లో  ఆహా కంటెంట్ టీం చాలా నాసిరకమైన ప్రశ్నలను, ఇతర విషయాలను జోడించిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ ఎపిసోడ్ పై కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ బాహుబలి రేంజిలో బిల్డప్ ఇచ్చారు తీరా చూస్తే ఇది ఆదిపురుష్‌ టీజర్ లా ఉంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇ క రెండో భాగం జనవరి 6న స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. దాంతో ఈ షోలో త‌దుప‌రి ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న బాలయ్య- పవన్ కళ్యాణ్ లా ఎపిసోడ్ పై ప్రేక్షకులలో ప్రత్యేక చర్చ నడుస్తోంది. ఎపిసోడ్ చిత్రీకరణ కూడా పూర్తయింది. 

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ టాక్ షోలో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రశ్నించార‌ట. బాలయ్య ప్రశ్నలకు పవన్ కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పినట్లు సమాచారం. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగాను చర్చనీయాంశంగా మారడం... పవన్ పెళ్లిల‌పై  పార్టీలు విమర్శలు గుప్పించడం.... ఆయన పెళ్లిలను ఆయుధంగా వారు వాడుతుండటం తెలిసిందే.  దీంతో ఈ షో ద్వారా దానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో బాలయ్య పవన్ ను క్లారిటీ అడిగారు.  ముందు ఈ షోలో పవన్ని బాలయ్య వ్యక్తిగత విషయాల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు సంధించే  అవకాశం లేదని, పవన్‌ ముందుగానే పెళ్లిళ్ల విషయంలో ఎలాంటి ప్రశ్నలు వేయవద్దని కోరాడని ప్రచారం జరిగింది.

కానీ ఆ వార్తలో నిజం లేదని పవన్ ఈ షో సాక్షిగా తన మూడు పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చాడని తెలుస్తోంది. గ‌తంలో ఓ స‌భ‌లో పవన్ కళ్యాణ్ తనపై వైఎస్ఆర్సిపి నేతలు చేస్తున్న మూడు పెళ్లిళ్ల విమర్శలకు చెప్పుతో సమాధానం చెబుతానని సంచలన ప్రకటన చేశారు.  ఎందుకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందో ఆయ‌న ఈ ఎపిసోడ్‌లో వివరించిన  తర్వాత బాలయ్య మాట్లాడుతూ మీరు ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతుంటే వారు ఊర కుక్కలతో సమానం అంటూ ఘటైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి పవన్ షో అటు పవన్ వ్యక్తిగత విషయాలు, పవన్ పెళ్లిళ్లు,పవన్ -నాగబాబు- చిరుల  మధ్య ఉండే విభేదాలు, జనసేన పార్టీ సంగతులు, టిడిపితో జనసేన పొత్తు వంటి అంశాలపై రంజు రంజుగా సాగింద‌ని  తెలుస్తోంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.