![]() |
![]() |

క్రేజ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన తెర మీద కనిపిస్తే చాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. అయితే కొత్త చిత్రంతో స్టార్స్ భారీ కలెక్షన్స్ రాబట్టడం పెద్ద విషయమేమి కాదు. ఎందుకంటే అది తరచూ జరిగేదే. కానీ ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం నాటి చిత్రాన్ని రీరిలీజ్ చేస్తే.. దానితో కూడా కలెక్షన్ల సునామీ సృష్టించడం పవర్ స్టార్ కే సాధ్యమవుతుందేమో అనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ ఆల్ టైం క్లాసిక్ ఫిల్మ్ 'ఖుషి'ని డిసెంబర్ 31న రీరిలీజ్ చేశారు. కొత్త సినిమా విడుదల సమయంలో కనిపించినంత సందడి థియేటర్ల దగ్గర కనిపించింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజులోనే ఏకంగా రూ.3.62 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ రూ.1.52 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు రోజుల్లో ఏకంగా రూ.5.14 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రూ.2.30 కోట్ల గ్రాస్, సీడెడ్ లో రూ.64 లక్షల గ్రాస్, ఆంధ్రాలో రూ.2.20 కోట్ల గ్రాస్ గా ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా చూస్తే రెండు రోజుల్లో రూ.5.91 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఇప్పటికే పవన్ నటించిన 'జల్సా' సినిమా రీరిలీజ్ లో భారీ కలెక్షన్స్ తో సత్తా చాటగా.. ఇప్పుడు 'ఖుషి'తో తన రికార్డులు తానే బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పడం విశేషం.
![]() |
![]() |