![]() |
![]() |

అసలు ఆనంద పడాలో బాధపడాలో అర్థం కానీ పరిస్థితిలో ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఉన్నారు. ఎందుకంటే RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. అదే ఆయనకు ఇబ్బందిగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ యూనిక్ కాన్సెప్టులతో పాన్ ఇండియా మూవీస్‌గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో NTR 30 సినిమా స్క్రిప్ట్ అంతటినీ పూర్తిగా మార్చాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. దానికి సమయం పట్టేసింది. మరో వైపు ఎన్టీఆర్‌తో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన రామ్ చరణ్ స్పీడుగా వెళ్లిపోతున్నారు. శంకర్ దర్శకత్వంలో చరణ్ చేస్తున్న సినిమా ఈ ఏడాదిలో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే అరవై శాతానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది. ఇక్కడేమో తారక్ NTR 30 షూటింగ్ స్టార్టే చేయలేదు.
యంగ్ టైగర్ ఫ్యాన్స్‌లో తెలియని టెన్షన్ నెలకొంది. అడిగితే పాన్ ఇండియా అదీ ఇదీ.. అని అంటున్నారు. కానీ సినిమా గురించి మాట్లాడటం లేదనేది వారి బాధకు కారణమైంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్బంగా NTR 30 గురించి అప్‌డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఫిబ్రవరిలో షూటింగ్‌ను మొదలెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ప్రకటించేశారు. అంతా బాగానే ఉంది. 2023 ఇప్పుడే మొదలైంది. మరి ఈ ఏడాది మాటేంటనేది ఫ్యాన్స్ ప్రశ్న. ఆ లెక్కలో చూస్తే 2023 యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కి నిరాశే. ఎందుకంటే తమ అభిమాన హీరోని వారు సిల్వర్ స్క్రీన్‌పై చూడలేరనే చెప్పాలి. మరి ఫ్యాన్స్ బాధను యంగ్ టైగర్ ఎలా భర్తీ చేస్తారో చూడాలిక.
![]() |
![]() |