![]() |
![]() |

దీపికా పదుకొనె .. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళ్తోంది. బాలీవుడ్ సినిమాలు, ప్రాంతీయ సినిమాలనే హద్దులు చెరిగిపోతున్న నేపథ్యంలో దీపికా పదుకొనె సినిమాలన్నీనార్త్ ప్రేక్షకులనే కాదు సౌత్ ఆడియెన్స్‌ను కూడా అలరించబోతున్నాయి. 2023 ఏడాది దీపిక తన సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో హల్ చల్ చేయనుందనేది కాదనలేని వాస్తవం ఆమె సినిమాల లైనప్ చూస్తే ఎవరైనా ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే.
2023 ప్రారంభంలో అంటే జనవరి 26 షారూక్ ఖాన్‌తో దీపిక కలిసి నటించిన పఠాన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో దీపికా పదుకొనె ఎలా రెచ్చిపోయి నటించదనే విషయాన్ని రీసెంట్‌గా విడుదలైన పాటల రూపంలో మనం చూశాం. ఇక సిల్వర్ స్క్రీన్‌పై ఈ అమ్మడు మంటలను ఎలా పుట్టించనుందో చూడాల్సిందే. దీని తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్రాజెక్ట్ కె చిత్రంలోనూ దీపికనే హీరోయిన్. ఇందులో ఆమె పాత్ర ఎలా ఉంటుందనేది ఇంకా రివీల్ కాలేదు. జూన్‌లోనే షారూక్ ఖాన్ మరో మూవీ జవాన్ రిలీజ్ అవుతుంది. ఆ చిత్రంలో దీపికా పదుకొనె గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. జవాన్ కూడా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇది కాకుండా అమెరికా ఫిల్మ్ ది ఇంటెర్న్ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవన్నీ క్రేజీ ప్రాజెక్ట్సే.. వీటితో హిందీ ఆడియెన్స్‌తో పాటు దక్షిణాది ప్రేక్షకులకు కూడా దీపికా పదుకొనె దగ్గర కానుంది.
![]() |
![]() |