![]() |
![]() |

ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన 'పొన్నియన్ సెల్వన్-1' సెప్టెంబర్ 30న విడుదలై తమిళనాడు మినహా ఇతర ప్రాంతాల్లో డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది. ముఖ్యంగా తమిళనాడు, ఓవర్సీస్ లో భారీ వసూళ్లు రాబడుతున్న ఈ మూవీ తాజాగా రూ.300 కోట్ల క్లబ్ లో చేరింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 'పొన్నియన్ సెల్వన్-1' ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.301.25 కోట్ల గ్రాస్(రూ.155.30 కోట్ల షేర్) రాబట్టింది. తమిళనాడులో రూ.116.40 కోట్ల గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో రూ.15.55 కోట్ల గ్రాస్, కర్ణాటకలో రూ.18.60 కోట్ల గ్రాస్, కేరళలో రూ.16.80 కోట్ల గ్రాస్, రెస్టాఫ్ ఇండియా రూ.17.55 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో రూ.116.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని అంచనా.
వరల్డ్ వైడ్ గా రూ.130 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'పొన్నియన్ సెల్వన్-1' ఆరు రోజుల్లో రూ.155.30 కోట్ల షేర్ రాబట్టి ఇప్పటికే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది. అయితే తెలుగులో మాత్రం 'పొన్నియన్ సెల్వన్'కి స్వల్ప నష్టాలు తప్పేలా లేవు. తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.8.26 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ కి ఇంకా రెండు కోట్ల షేర్ దూరంలో ఉంది. అయితే తెలుగులో 'పొన్నియన్ సెల్వన్'కి నెగటివ్ టాక్ రావడం, పైగా ఇప్పుడు థియేటర్స్ లోకి 'గాడ్ ఫాదర్', 'ది ఘోస్ట్', 'స్వాతిముత్యం' వంటి తెలుగు సినిమాలు రావడంతో.. తెలుగు రాష్ట్రాల్లో 'పొన్నియన్ సెల్వన్' బాక్సాఫీస్ రన్ దాదాపు ముగిసినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |