![]() |
![]() |
.webp)
గాడ్ ఫాదర్ వరల్డ్ వైడ్ గా హుంగామ స్టార్ట్ చేసేసింది. విజయదశమి కానుకగా గాడ్ ఫాదర్ చిత్రం విడుదల అయ్యింది. ఇక ఈ మూవీలో స్టార్ కాస్టింగ్ చాలా భారీగా ఉంది. నయనతార, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గ్లామరస్ యాంకర్ అనసూయ కూడా ఒక పాత్రలో కనిపించింది.
అయితే మెగాస్టార్ చిరంజీవి సడెన్గా అనసూయకి సారీ చెప్పారు. ఎందుకంటే రీసెంట్ గా అనంతపురంలో గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు జోరుగా వాన కురిసేసరికి చిరు ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు. ఇక ఈ వర్షం కారణంగా ఈ మూవీలో కొంత మంది పేర్లను తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. అందులో అనసూయ పేరు కూడా ఉంది. దీనితో అనసూయ చిరంజీవిపై అలిగింది తెలుసుకుని ఈ ఈవెంట్ కి సంబంధించి జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని చిరు ప్రస్తావించారు.
"తన పేరు చెప్పలేదని ఒక అమ్మాయి నా మీద అలిగింది. అది అనసూయ.. సారీ అమ్మా నీ పేరు మరచిపోయాను" అంటూ ఆయన చాలా వినమ్రంగా సారీ చెప్పారు. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ పేరు కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మరచిపోయా అని చిరంజీవి అన్నారు. ఇక అనసూయ కూడా ఈ చిత్రంలో బాగా నటించింది అని చిరు ప్రశంసించారు.
![]() |
![]() |