![]() |
![]() |

చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన 'గాడ్‌ఫాదర్' మూవీ దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 5న భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ పోషించడంతో, హిందీ బెల్ట్‌లోనూ కలెక్షన్లు సాధించాలనే ఉద్దేశంతో హిందీ వెర్షన్‌నూ రిలీజ్ చేశారు. మోహన్‌లాల్ టైటిల్ రోల్ చేసిన మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ 'లూసిఫర్'కు ఈ గాడ్‌ఫాదర్ రీమేక్. 'హనుమాన్ జంక్షన్' ఫేమ్ మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్ భార్యాభర్తలుగా నటించారు.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'గాడ్‌ఫాదర్'కు క్రిటిక్స్ నుంచి, ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒరిజినల్‌ను మక్కీకి మక్కీ దించకుండా, కొన్ని మార్పులతో ఈ సినిమాని తీసిన డైరెక్టర్‌కు ప్రశంసలు లభించాయి. అయితే ఆ స్పందనకు అనుగుణంగా ఓపెనింగ్స్ రాలేదనేది నిజం. చిరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక.. తక్కువ ఓపెనింగ్స్ వచ్చిన సినిమా ఇదే. అయితే మౌత్ టాక్ బాగుండటంతో కలెక్షన్లు పుంజుకుంటాయనే ఆశాభావాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
కాగా 'గాడ్‌ఫాదర్'.. ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ రూ. 57 కోట్లకు సొంతం చేసుకుందంటూ ఇదివరకే వార్తలు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ ఏ తేదీన 'గాడ్‌ఫాదర్'ను స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తుందనేది ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పెద్ద సినిమాని థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేయాలని టాలీవుడ్ ఆమధ్య స్వీయ నిబంధన ఒకటి ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రకారం చూసుకుంటే డిసెంబర్ మొదటి వారంలో ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి.
![]() |
![]() |