![]() |
![]() |

జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్టర్ వేణుగా మారబోతున్నాడు. డైరెక్టర్ తేజ ద్వారా ఆయన మూవీస్ తో వెలుగులోకి వచ్చిన వేణు.. తెలుగులో చాలా మూవీస్ లో నటించాడు. ముఖ్యంగా "మున్నా" సినిమాలో ప్రభాస్ కి పోటీగా హీరోయిన్ ని ప్రేమించే పాత్రలో వేణు అద్భుతంగా నటించి అందరి మనస్సులో నిలిచిపోయాడు. కానీ అనుకున్నంత పేరు మాత్రం రాలేదు.
తర్వాత బుల్లితెర మీదకు జబర్దస్త్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ పర్వాలేదనిపించుకున్నాడు కానీ అక్కడ ఏమంత గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు వేణు తెలంగాణ ఆత్మహత్యల నేపథ్యంలో సొంతంగా ఓ స్టోరీ, స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. వేణు రాసుకున్న కథ దిల్ రాజుకి నచ్చేసరికి ఆ సినిమా డైరెక్షన్ పనుల్ని కూడా అతన్నే చేయమని చెప్పారట. ఈ మూవీకి వేణునే దర్శకుడు కాగా, దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి రాబోతోంది. ఐతే ఈ సినిమాకు సంబంధించి నటీనటులు ఎవరు , టెక్నీషియన్స్ ఎవరు వంటి వివరాలు ఏవీ ఇంకా బయటికి రాలేదు. కమెడియన్ వేణు డైరెక్టర్ వేణుగా మారడం ఓకే కానీ ఎంత వరకు సక్సెస్ అవుతాడు అనే విషయం గురించి తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాలి.
![]() |
![]() |