![]() |
![]() |

అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'థాంక్యూ'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ ను తాజాగా మేకర్స్ ఇచ్చారు.
ఇప్పటికే విడుదలైన 'థాంక్యూ' టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తన జీవితంలో కొందరికి 'థాంక్యూ' చెప్పడం కోసం చైతన్య సాగించే ప్రయాణమే ఈ స్టొరీ అన్నట్లుగా టీజర్ ని ఆసక్తికరంగా మలిచారు. దీంతో 'థాంక్యూ'పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడటమే కాకుండా.. ట్రైలర్ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచుసేలా చేశారు. విడుదలకు ఇంకా పది రోజులే ఉండటంతో మూవీ టీమ్ 'థాంక్యూ' ట్రైలర్ విడుదల చేయడానికి సిద్ధమైంది. రేపు(జూలై 12) సాయంత్రం 6:03 కి ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో మూడు భిన్న లుక్స్ తో చైతన్య ఆకట్టుకుంటున్నాడు.

రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా పీసీ శ్రీరామ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |