![]() |
![]() |

కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకుడిగానూ పలు సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ 'రణం' మినహా మిగతావేవీ పెద్దగా విజయం సాధించలేదు. అయినప్పటికీ ఆయన దర్శకుడిగా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన 'హై ఫైవ్' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తానని చెప్పి మాట తప్పాడంటూ హీరో నితిన్ పై అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యాడు.
"పది రోజుల క్రితమే నితిన్ ని ఈవెంట్ కి ఆహ్వానించా. వస్తానని మాట ఇచ్చాడు. కానీ రాలేదు. నితిన్ కి అసలు డ్యాన్సే రాదు. ఆయనకు డ్యాన్స్ నేర్పించి, గుర్తింపు వచ్చేలా చేశా. గురువు లాంటి నా మీద గౌరవంతో వస్తాడని భావించా. కానీ ఇంట్లో ఉండి కూడా రాలేదు. ఫోన్ చేస్తే జ్వరమని చెప్పాడు. కనీసం వీడియో బైట్ అయినా ఇవ్వమని కోరా. అది కూడా ఇవ్వలేదు. జీవితంలో మనం ఏ స్థాయికి వెళ్ళినా.. మనకి సాయపడిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. నితిన్ నువ్వు రాలేకపోతే రానని చెప్పాలి. వస్తానని చెప్పి రాకుండా నన్ను అవమానించావు. నాకెంతో బాధగా ఉంది" అంటూ అమ్మ రాజశేఖర్ ఎమోషనల్ అయ్యాడు.
కాగా 2007 లో నితిన్, అమ్మ రాజశేఖర్ కాంబినేషన్ లో 'టక్కరి' అని సినిమా వచ్చింది.
![]() |
![]() |