![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన కనువిందు చేసిన కథానాయికల్లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. బ్లాక్ బస్టర్ మూవీ `మహర్షి` (2019)లో ఈ ఇద్దరు తొలిసారిగా ఆడిపాడారు. కట్ చేస్తే.. మూడేళ్ళ తరువాత మరోమారు జట్టుకట్టబోతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న పేరు నిర్ణయించని కొత్త సినిమా కోసం మహేశ్, పూజ మళ్ళీ కలిసి సందడి చేయబోతున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్నాడు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ బాట పట్టనున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. మహేశ్, పూజ ఫస్ట్ కాంబినేషన్ మూవీ `మహర్షి` కూడా సమ్మర్ సీజన్ లోనే ఎంటర్టైన్ చేసింది. 2019 మే 9న విడుదలైన `మహర్షి` ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. సేమ్ సీజన్ లో రాబోతున్న మహేశ్ బాబు - పూజా హెగ్డే సెకండ్ కాంబినేషన్ మూవీ కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
![]() |
![]() |