![]() |
![]() |

కింగ్ నాగార్జున, ఆయన తనయుడు యువ సామ్రాట్ నాగచైతన్య.. ఒకే బాటలో పయనిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా వరుస నెలల్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సందడి చేయనున్నారు. అయితే, ముందుగా చైతూ ఇలా వరుస చిత్రాలతో పలకరిస్తుండగా.. అటుపై నాగ్ కూడా అలాగే ఎంటర్టైన్ చేయనున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. `మనం` తరువాత విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన సినిమా `థాంక్ యూ`. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జూలై 22న రిలీజ్ కాబోతోంది. మరోవైపు.. మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తో కలిసి చైతూ నటించిన హిందీ సినిమా `లాల్ సింగ్ చద్ధా` ఆగస్టు 11న విడుదలకు సిద్ధమైంది. అంటే.. జూలై, ఆగస్టు మాసాల్లో చైతూ వరుసగా రెండు చిత్రాలతో వినోదాలు పంచనున్నాడన్నమాట.
ఇక నాగ్ సంగతికి వస్తే.. చాన్నాళ్ళ తరువాత ఆయన నటించిన హిందీ చిత్రం `బ్రహ్మాస్త్ర`. ఈ సినిమాకి సంబంధించిన తొలి భాగం `బ్రహ్మాస్త్రః పార్ట్ వన్ శివ` సెప్టెంబర్ 9న జనం ముందుకు రాబోతోంది. తెలుగులోనూ ఈ సినిమా అనువాద రూపంలో తెరపైకి వస్తోంది. ఇంకోవైపు.. నాగ్ హీరోగా నటించిన `ద ఘోస్ట్` అక్టోబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. సో.. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నాగ్ వరుసగా రెండు చిత్రాలతో అలరించనున్నాడన్నమాట.
మరి.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో వరుస నెలల్లో పలకరించబోతున్న నాగ్, చైతూ.. ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |