![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'టైగర్ నాగేశ్వరరావు'తో అభిమానుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు. కొంత కాలం క్రితం ఈ సినిమాని అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ బాగా వ్యక్తమైంది. వంశీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. సెట్స్‌లో నైట్ షూట్‌కు సంబంధించిన ఒక వీడియోను ఇప్పుడు షేర్ చేశాడు రవితేజ.
లొకేషన్‌లో పనిచేస్తోన్న కెమెరా టీమ్, ఇతర సిబ్బందిని ఆ వీడియోలో మనం చూడొచ్చు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో 'టైగర్ నాగేశ్వరరావు' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను తన దొంగతనాలతో గడగడలాడించిన స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావుగా ఈ మూవీలో నటిస్తున్నాడు రవితేజ. ఆ క్యారెక్టర్ కోసం తన బాడీ లాంగ్వేజ్‌తో పాటు డైలాగ్ డిక్షన్‌ను కూడా ఆయన మార్చుకున్నాడని సమాచారం.
కృతి సనన్ చెల్లెలు నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకునిగా, ఆర్. మది సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ రాస్తున్న ఈ మూవీకి అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ మూవీ విడుదల కానున్నది.
కాగా త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో 'ధమాకా', సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' సినిమాలను కూడా చేస్తున్నాడు రవితేజ. ఆయన శరత్ మండవ డైరెక్షన్‌లో టైటిల్ రోల్ పోషించిన 'రామారావు ఆన్ డ్యూటీ' ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, విడుదల తేదీని వాయిదా వేశారు.
![]() |
![]() |