![]() |
![]() |

ఈతరం సంగీత దర్శకుల్లో వివేక్ సాగర్ తీరే వేరు. తనదైన బాణీలతో సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తున్న ఈ టాలెంటెడ్ కంపోజర్.. ఇప్పటికే `పెళ్ళి చూపులు` (2016), `సమ్మోహనం` (2018), `ఈ నగరానికి ఏమైంది` (2018), `బ్రోచేవారెవరురా` (2019), `హిట్ః ద ఫస్ట్ కేస్` (2020) వంటి విజయవంతమైన చిత్రాలకు స్వరాలు సమకూర్చాడు. కట్ చేస్తే.. ఇప్పుడు `అంటే.. సుందరానికీ!`తో పలకరించేందుకు సిద్ధమయ్యాడు. నేచురల్ స్టార్ నాని, కేరళకుట్టి నజ్రీయా ఫహద్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా.. జూన్ 10న విడుదలకు సిద్ధమైంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో జూన్ నెలలో విడుదలైన వివేక్ సాగర్ మ్యూజికల్స్ అన్నీ సక్సెస్ బాట పట్టాయి. 2018 జూన్ లో `సమ్మోహనం`, `ఈ నగరానికి ఏమైంది`తోనూ.. 2019 జూన్ లో `బ్రోచేవారెవరురా`తోనూ వివేక్ సాగర్ ఖాతాలో జూన్ హిట్స్ పడ్డాయి. మరి.. సెంటిమెంట్ రిపీట్ అయి `అంటే .. సుందరానికీ!`తోనూ వివేక్ సాగర్ ఖాతాలో నాలుగో జూన్ హిట్ పడుతుందేమో చూడాలి.
కాగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన `అంటే.. సుందరానికీ!`ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
![]() |
![]() |